Gold Price Today: స్థిరంగా బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త. గత 2 రెండ్రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఇవాళ కాస్త స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 19, 2021, 07:26 AM IST
  • దేశంలో స్థిరంగా బంగారం ధర
  • దేశంలో అత్యధికంగా బంగారం ధర ఢిల్లీలో, అత్యల్పంగా తెలుగు రాష్ట్రాల్లో
  • 24 క్యారెట్ల బంగారం మాత్రం ముంబైలో ే అత్యంత చవక
Gold Price Today: స్థిరంగా బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర

Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త. గత 2 రెండ్రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఇవాళ కాస్త స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధర మారుతుంటుంది. ఢిల్లీ, ముంబై నగరాలతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోనే అత్యల్పంగా ఉంటోంది. 24 క్యారెట్ల బంగారం విషయంలో మాత్రం ముంబై ధర అందరికీ అనుకూలంగా ఉంటోంది. 

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర(Gold Price) 782  రూపాయలు పెరిగి..52 వేల 2 వందలకు చేరింది. అటు 22 క్యారెట్ల  బంగారం10 గ్రాముల ధర 710 పెరిగి 47 వేల 850కు చేరింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 720 రూపాయలు కాగా..22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 720 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 850 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల గురించి తెలుసుకుందాం.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం(Hyderabad Gold Price)పది గ్రాముల ధర 49 వేల 850 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 700గా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Gold Price today: రానున్న రోజుల్లో పసిడి మరింత ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News