5G services in Hyderabad: భారత్‌లోని 13 నగరాల్లో 5జీ సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌కు!!

కొత్త ఏడాది 2022లో టెలికాం రంగంలో సరికొత్త మార్పు రాబోతోంది. భారత దేశ వ్యాప్తంగా త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు ఆరంభం కానున్నాయి. 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ (డీవోటీ) ఓ ప్రకటనలో తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 09:36 AM IST
  • టెలికాం రంగంలో సరికొత్త మార్పు
  • భారత్‌లోని 13 నగరాల్లో 5జీ సేవలు
  • త్వరలోనే హైదరాబాద్‌కు 5జీ సేవలు
5G services in Hyderabad: భారత్‌లోని 13 నగరాల్లో 5జీ సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌కు!!

Major Telecom Operators to be launched 5G services soon in India: కొత్త ఏడాది 2022లో టెలికాం రంగంలో సరికొత్త మార్పు రాబోతోంది. భారత దేశ వ్యాప్తంగా త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు (5G Services) ఆరంభం కానున్నాయి. 2022లో భారత్‌లో 5జీ సేవలు (5G services in India) ప్రారంభం కానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌ (DOT) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు ముందుగా ప్రారంభం కానున్నాయట. స్వదేశీ 5G టెస్ట్‌ బెడ్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుందని, 2021 డిసెంబర్ 31 నాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉందని సోమవారం అధికారిక ప్రకటన వెలుబడింది.

దేశంలోని మెట్రో మరియు పెద్ద నగరాలలో వచ్చే ఏడాది 5G సేవలు (5G Services) అందుబాటులోకి రానున్నాయి. అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగర్‌, గాంధీనగర్‌, గుర్గావ్‌, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ (5G services in Hyderabad), కోల్‌కతా, జామ్‌నగర్‌, లక్నో, ముంబై, పూణెలో ముందుగా 5జీ సేవలు ఆరంభం కానున్నాయి. అయితే ఏ టెలికాం ఆపరేటర్ ముందు 5జీ సేవలను ప్రారంభిస్తుందో సమాచారం తెలియరాలేదు. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ (వొడాఫోన్ మరియు ఐడియా) లాంటి నెట్‌వర్క్స్ ఇప్పటికే కొన్ని నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ సైట్స్‌ను సెటప్ చేశాయి.

Also Read: Ashes 2021: బోలాండ్‌ సంచలన ప్రదర్శన.. మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం! యాషెస్‌ ఆసీస్‌దే!!

టెలికాం (Telecom Operators) రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 150 శాతం పెరిగాయి. 2002 నుంచి 2014 వరకు రూ. 62,386 కోట్లు ఉండగా.. 2014-2021 మధ్య 1,55,353 కోట్లకు పెరిగాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DOT) నిధులతో దేశీయ 5G టెస్ట్‌బెడ్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad), ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ బెంగళూరు, సమీర్ మరియు సీఈవీఐటీ ఎనిమిది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు 36 నెలలుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. సుమారు రూ. 224 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ 2021 డిసెంబర్ 31 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 6G సేవలను (6G Services) ఉపయోగించుకునేందుకు కూడా ఇది దోహదపడనుందట. 

Also Read: Children Vaccination: చిన్నారులకు టీకా.. మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం! ఆధార్ లేకుంటే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News