LIC Scheme: ఆ ఎల్ఐసీ పధకంలో..నేరుగా కోటి రూపాయలు ప్రయోజనం, ఎలాగంటే

LIC Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మరో అద్భుత పథకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఈ పాలసీ తీసుకుంటే కోటి రూపాయలు లాభం కలగనుంది..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2022, 08:59 PM IST
LIC Scheme: ఆ ఎల్ఐసీ పధకంలో..నేరుగా కోటి రూపాయలు ప్రయోజనం, ఎలాగంటే

కష్టపడి సంపాదించే డబ్బును సురక్షిత మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు ఎవరైనా. ఎల్ఐసీ అద్భుతమైన సురక్షితమైన పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం పేరు జీవన్ శిరోమణి ప్లాన్. ఆ వివరాలు మీ కోసం..

ఎల్ఐసీ గతంలో అద్భుతమైన పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పాలసీ పేరు జీవన్ శిరోమణి పాలసీ. ఈ పథకంలో మీకు 1 రూపాయికి కూడా అద్భుత లాభం కలుగుతుంది. ఎల్ఐసీ అన్ని వర్గాల్ని దృష్టిలో ఉంచుకుని పాలసీ రూపొందిస్తుంది. ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ శిరోమణి ప్లాన్ చాలా మంచి పథకం. ఇదొక సురక్షితమైన సేవింగ్ స్కీమ్. 

1 కోటి రూపాయల వరకూ గ్యారంటీ డబ్బులు

ఎల్ఐసీ ప్లాన్ జీవన్ శిరోమణి పాలసీ నాన్ లింక్డ్ ప్లాన్. ఇందులో కనీసం 1 రూపాయి గ్యారంటీ డబ్బు లభిస్తుంది. ఎల్ఐసీ కస్టమర్ల జీవితాన్ని సురక్షితం చేసేందుకు చాలా పాలసీలు అందిస్తోంది. 

ఎల్ఐసీ జీవన్ శిరోమణి పథకం 2017 డిసెంబర్ 19వ తేదీన ప్రారంభమైంది. ఇదొక నాన్ లింక్డ్ , పరిమితమైన ప్రీమియం పేమెంట్ మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీ ముఖ్యంగా హెచ్‌ఎన్ఐల కోసం రూపొందించారు. ఈ పాలసీ సీరియస్ వ్యాధుల్ని కూడా కవర్ చేస్తుంది. 

జీవన్ శిరోమణి పాలసీ సమయంలో పాలసీదారుల డెత్ బెనెఫిట్స్ కింద...కుటుంబానికి ఆర్ధిక సహాయం అందుతుంది. ఈ పాలసీలో పాలసీదారులు బతికుంటే..నిర్ణీత వ్యవధిలో పేమెంట్ సౌకర్యముంటుంది. 

సర్వైవల్ బెనిఫిట్స్ అంటే పాలసీ హోర్డర్లు బతికుంటే నిశ్చితమైన చెల్లింపు ఉంటుంది. 14 ఏళ్ల పాలసీలో 10, 12వ ఏట 30 శాతం చొప్పున మనీ బ్యాక్ ఉంటుంది. ఇక 16 ఏళ్ల పాలసీలో 12, 14 ఏళ్లకు 35 శాతం చొప్పున మనీ బ్యాక్ ఉంటుంది. 18 ఏళ్ల పాలసీలో 14, 16 ఏళ్లకు 40 శాతం చొప్పుున మనీబ్యాక్ ఉంటుంది. 20 ఏళ్ల పాలసీలో 16, 18 ఏళ్లకు 45 శాతం చొప్పున మనీ బ్యాక్ ఉంటుంది.

పాలసీ నియమాలు

కనీస మొత్తం కోటి రూపాయలు లభిస్తాయి. గరిష్టంగా ఏ విధమైన పరిమితి లేదు. పాలసీ వ్యవధి 14, 16, 18 20 ఏళ్లకు ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం 4 ఏళ్ల పాటు చెల్లించాలి. ప్రారంభించేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు. ఇక గరిష్ట వయస్సు పరిమితి పాలసీని బట్టి మారుతుంది. 14 ఏళ్లకైతే 55 ఏళ్లు గరిష్ట వయస్సుగా ఉంది. 16 ఏళ్లకు 51 ఏళ్లు, 18 ఏళ్లకు 48 ఏళ్లు, 20 ఏళ్లకు 45 సంవత్సరాలు గరిష్ట పరిమితి.

Also read: Post Office: పోస్టాఫీసు పథకంలో రోజుకు 50 రూపాయలతో..35 లక్షలు పొందండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News