Varun Dhawan: సౌత్ ఇండియా హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్ హీరో.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో!

Varun Dhawan Upcoming Movie: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. వరుణ్ ధావన్ కూడా ఒకరు. చేతినిండా సినిమాలతో.. బిజీగా ఉన్న వరుణ్ ధావన్ ఈమధ్య తెలుగు హీరోయిన్లతోనే.. సినిమాలు సైన్ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వరుణ్ ధావన్ ఏకంగా ముగ్గురు తెలుగు హీరోయిన్లతో ప్రాజెక్టులు చేస్తున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 26, 2024, 02:53 PM IST
Varun Dhawan: సౌత్ ఇండియా హీరోయిన్స్ పై కన్నేసిన బాలీవుడ్ హీరో.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో!

Varun Dhawan Next Movie: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తనయుడిగా.. ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్ ధావన్. తక్కువ సమయంలోనే.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో తనకంటూ.. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా ఏర్పరచుకున్నారు. 

2023లో జాన్వీ కపూర్.. హీరోయిన్ గా నటించిన బవాల్ సినిమాతో.. మంచి హిట్ అందుకున్న వరుణ్ ధావన్.. ఇప్పుడు మరికొన్ని సినిమాలతో.. బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరుణ్ ధావన్ చేయబోయే.. చాలా వరకు ప్రాజెక్టులలో మన తెలుగు హీరోయిన్లు ఉండటం. 

రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడేల్ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్.. హీరోగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో మన తెలుగు స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో నటించిన సిటాడెల్.‌. సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా.. హిందీలో సిటాడెల్‌.. హనీ బన్నీ విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో.. విడుదల కాబోతోంది. 

మరోవైపు వరుణ్ ధావన్.. కలీస్ అనే డైరెక్టర్ తో.. బేబీ జాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహానటి.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 2016లో అట్లీ దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ అయిన.. తేరి సినిమా కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న.. ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు.. రెండవ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. 

ఇది చాలదు అన్నట్టు.. వరుణ్ ధావన్ ఇప్పుడు.. తన తండ్రి.. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది.

సమంత ఇంతకుముందే హిందీలో.. ఒక వెబ్ సిరీస్ లో నటించింది. మిగతా ఇద్దరు హీరోయిన్లు వరుణ్ ధావన్ ప్రాజెక్టుల తోనే హిందీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అయితే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తన సినిమాల్లో తెలుగు హీరోయిన్లనే ఎంపిక చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News