LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ

LIC IPO: ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూ రానే వచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు (మే 4) నుంచి ప్రారంభమై మే 9న ముగియనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 12:53 PM IST
  • దేశంలోనే జంబో ఐపీఓ
  • ఈ రోజు నుంచి మే 9 వరకు
  • కనీసం రూ.15 వేలు పెట్టుబడి
LIC IPO Opens: ప్రారంభమైన జంబో ఎల్ఐసీ ఐపీఓ

LIC IPO: ఎప్పటి నుంచో అందరు ఎదురు చూస్తున్న ఎల్‌ఐసీ మెగా పబ్లిక్‌ ఇష్యూ రానే వచ్చింది. దీని సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు (మే 4) నుంచి ప్రారంభమై మే 9న ముగియనుంది. పాలసీహోల్డర్స్‌కు, ఎల్ఐసీ ఉద్యోగులు, రీటైల్ ఇన్వెస్టర్లు ఈ సబ్‌స్క్రిప్షన్‌తో ఐపీఓలో అధిక మొత్తంలో డిస్కౌంట్ పొందవచ్చు.  రూ.902 నుంచి 949గా పబ్లిక్‌ ఇష్యూ ప్రైస్‌ను ప్రకటించారు. దీంతో LIC పాలసీదారులకు రూ.60, ఎల్ఐసీ సిబ్బందికి రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో యాంకర్‌ ఇన్వెస్టర్లకు సంబంధించి విభాగానికి పెద్ద మొత్తంలో స్పందన రావడం విశేషం.తొలిసారి ఈ కార్యక్రమంలో  పాలసీ వినియోగదారులు పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటున్నారు.

IPOకి సంబంధించిన పూర్తి వివరాలివి:

#ఒక్కొక్క షేర్‌ విలువ రూ. బౌ902 నుంచి రూ.949 వరకు
#ఎల్ఐసీ ఐపీఓ(LIC IPO)లో అధికంగా 14 లాట్స్‌ను రిటైల్ ఇన్వెస్టర్లు స్వాధీనం చేసుకోవచ్చు.
#LIC IPO ఒక్క లాట్‌ సైజు  15 షేర్లు
#ఎల్ఐసీ ఐపీఓ(LIC IPO)లో సైజు రూ.21 వేల కోట్లు
#LIC వినియోగదారులకు ఒక్కోక్క షేరుపై రూ.60 డిస్కౌంట్ పొందనున్నారు
#ఇది మే 17న మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం
#LIC IPOలో 3.5 వాటాలను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది.
 #LIC IPOలో ఒక్కో షేరుపై రూ.45 డిస్కౌంట్ రిటైల్ ఇన్వెస్టర్లకు లభించనుంది

భారత్‌లో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు, నిపుణులు ఎల్ఐసీ ఐపీఓ(LIC IPO)  ఇన్వెస్ట్ చేయాలని వారు చెబుతున్నారు. ఈ భారీ జంబో ఐపీఓపై మార్కెట్‌లో పెద్ద మొత్తంలో అంచనాలు ఉన్నాయి. మార్కెట్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం..లిస్టింగ్ కూడా అంద్భుతంగా ఉండే అంచనాలున్నాయని తెలుపుతున్నారు. ఇక యాంకర్‌ ఇన్వెస్టర్ల విషయానికొస్తే ఇందులో గవర్న్‌మెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, ఇన్వెస్కో ఇండియా, సెంట్ క్యాపిటల్ ఫండ్, బీఎన్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎల్ఎల్‌సీ, వంటివి ఉన్నాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు  మున్ముందు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: RRR OTT release date: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!

Also Read: Fourth wave covid-19: దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదా..వైద్యుల వాదన ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News