IT Refund Scam: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ. మరోవైపు ఇటీవల వెలుగు చూసిన ఐటీ రిఫండ్ కుంభకోణంపై ఇన్‌కంటాక్స్ సరికొత్త చర్యలు చేపట్టింది. ఇక నుంచి రిఫండ్ క్లెయిమ్ లక్ష రూపాయలు దాటినట్టయితే నోటీసులు పంపిస్తుంది ఐటీ శాఖ. ఎందుకు, అసలేం జరిగిందో తెలుసుకుందాం..
ఇన్‌కంటాక్స్ శాఖలో కూడా కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి. తప్పుడు పత్రాలతో రిటర్న్స్ ఫైల్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేసే ఘటనలు జరుగుతున్నాయి. అలాంటిదే ఓ కుంభకోణం ఇటీవల వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధికంగా తప్పుడు క్లెయిమ్స్‌తో కోట్లాది రూపాయుల రిఫండ్ వసూలు చేసినట్టు వెల్లడైంది. ఐటీ శాఖ చేసిన దర్యాప్తులో చాలా విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వార్షిక వేతనం 80 లక్షల రూపాయలు కాగా అందులో సగం మొత్తం అంటే 40 లక్షల్ని ఓ రాజకీయ పార్టీకు విరాళమిచ్చినట్టు క్లెయిమ్ చేసాడు. ఈ వ్యవహారంపై ఐటీ శాఖకు అనుమానమొచ్చి దర్యాప్తు చేపడితే అంతా బోగస్ అని తేలింది. అంతేకాకుండా ఈ తరహా బోగస్ క్లెయిమ్స్ చాలా బయటపడ్డాయి. ట్యాక్స్ ప్రాక్టీషనర్ల సహాయంతో ఇలాంటి తప్పుడు క్లెయిమ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ శాఖ 9 మందిని గుర్తించి లావాదేవీలపై నిఘా పెట్టింది.
కొంతమంది ట్యాక్స్ పేయర్లను ఇప్పటికే విచారించింది. ఇలా తప్పుడు పత్రాలతో రిఫండ్ క్లెయిమ్ చేసినవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పుడు అలాంటి వారిని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఐటీ శాఖ. అందుకే ఇక నుంచి ఒక ఆర్దిక సంవత్సరంలో రిఫండ్ లక్ష రూపాయలు దాటితే ఆ ట్యాక్స్ పేయర్లకు ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. మెయిల్ ద్వారా నోటీసులు అందుతాయి. రిఫండ్ పొందిన వివరాల్ని ఐటీ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాల్ని ఐటీ శాఖ మరోసారి తనిఖీ చేసిన తప్పు చేసినట్టు ఆధారాలు కన్పిస్తే కఠిన చర్యలు చేపడుతుంది. తప్పుడు క్లెయిమ్స్ చేసినవారి సంఖ్య లక్షల్లో ఉంటుందని..రిఫండ్ విలువ కోట్లలో ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. తప్పుడు క్లెయిమ్‌తో రిఫండ్ పొందినట్టే రుజువైతే జైలుశిక్ష కూడా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook