LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్

LIC New Jeevan Shanti Policy: రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నవారికి ఎల్ఐసీ సూపర్ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఒకసారి పెట్టుబడిపెడితే.. వృద్ధాప్యంలో మీరు ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 10:48 AM IST
LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్

LIC New Jeevan Shanti Policy: మీరు వృద్ధాప్యంలో పెన్షన్ లేక ఇబ్బందిపడుతున్నారా..? లేదా ఇప్పటి నుంచే రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నారా..? మీ వృద్ధాప్యంలో హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేసేందుకు ఇప్పటినుంచే ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టండి. ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఒక సూపర్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ (న్యూ జీవన్ శాంతి పాలసీ)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీరు ప్రతి నెల పెన్షన్ అందుకోవచ్చు. ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితకాల హామీతో పెన్షన్ పొందుతారు.  

ఇందులో రెండు రకాల పెట్టుబడులు ఉంటాయి. మొదటిది తక్షణ యాన్యుటీ కోసం, రెండవది వాయిదా వేసిన యాన్యుటీ కోసం. తక్షణ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే ఒకేసారి ప్రీమియం చెల్లించాలి. ఇందులో తక్షణమే పెన్షన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రెండో ఆప్షన్‌లో అంటే డిఫర్డ్ యాన్యుటీ పాలసీ తీసుకున్న 5, 10, 15 లేదా 20 ఏళ్ల తర్వాత పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీకు వెంటనే పెన్షన్ కావాలంటే మార్చుకోవచ్చు. 
 
ఈ పథకం కింద పెన్షన్ మొత్తం నిర్ణయించలేదు.ఇందులో మీ పెట్టుబడి, వయస్సు, వాయిదా వ్యవధి ప్రకారం మీకు పెన్షన్ లభిస్తుంది. మీ పెట్టుబడిపై చేసే శాతాన్ని బట్టి ఎల్‌ఐసీ పెన్షన్ ఇస్తుంది. పెట్టుబడి, పెన్షన్ మధ్య కాలాన్ని బట్టి పెన్షన్ ఉంటుంది. 

కనీసం 30 సంవత్సరాలు నుంచి 85 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీని తీసుకోవచ్చు. పెన్షన్ ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత జీవన్ శాంతి ప్లాన్‌లో లోన్ తీసుకోవచ్చు. రెండు ఎంపికల కోసం పాలసీని తీసుకునే సమయంలో గ్యారెంటీడ్ వార్షిక రేట్లు అందజేస్తారు. ఈ పథకం కింద వివిధ యాన్యుటీ ఎంపికలు, యాన్యుటీ చెల్లింపు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాలసీని తీసుకునే ముందు.. ఒకసారి ఎంచుకున్న ఎంపికను మార్చడం సాధ్యం కాదని గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాన్‌ను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Also Read: Adi Seshagiri Rao: వైసీపీ నుంచి బయటకు రావడానికి కారణం అదే.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు

Also Read: Ajith Thunivu : తెలుగు టైటిల్ ఇదే.. అజిత్‌ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News