రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...

Low investment high returns: ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జీవితాలు గాడి తప్పిపోతాయి. అలాగే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా జీవితంలో వెనుకబడిపోతాం. చిన్న మొత్తాల పొదుపుతోనే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందే ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 07:47 PM IST
  • మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో అద్భుతమైన ప్లాన్స్
  • రోజుకు రూ.20 పొదుపుతో దీర్ఘ కాలంలో భారీ రాబడి
  • దాదాపు రూ.188 కోట్లు పొందే అవకాశం
రోజుకు కేవలం రూ.20 పొదుపు చేస్తే చాలు... రూ.1.88 కోట్లు పొందవచ్చు...

Low investment high returns: డబ్బు సంపాదించడమే కాదు... సంపాదించినదానిలో కొద్దో గొప్పో కూడబెట్టడం ముఖ్యం... ఎప్పుడు ఏ ఆపద వస్తుందో.. ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి... సంపాదనలో ఎంతో కొంత సేవింగ్ (Savings) చేయాలి. కాస్త ముందు చూపు.. సరైన ప్లానింగ్ ఉంటే... మధ్య తరగతి జీవులు కూడా భారీ మొత్తాన్ని కూడబెట్టడం అసాధ్యమేమీ కాదు. కేవలం రోజుకు రూ.20 పొదుపు చేయడం ద్వారా మీ రిటైర్మెంట్ సమయానికి రూ.1కోటి మొత్తాన్ని కూడబెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ :

ప్రస్తుతం మీ వయసు 20 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పటినుంచే రోజుకు రూ.20 పొదుపు (Money Savings) చేయండి. అలా నెలకు రూ.600 పోగవుతాయి. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో ఇన్వెస్ట్ చేయండి. అలా 40 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. అంటే, 480 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది అసలు మొత్తంపై 15 శాతం వార్షిక రాబడి ఉంటుంది. అలా 40 ఏళ్లకు గాను రూ.1.88 కోట్ల మొత్తాన్ని పొందవచ్చు.

ఒకవేళ మీరు 20 ఏళ్ల వయసు నుంచి రోజుకు రూ.30 చొప్పున 40 ఏళ్ల పాటు సిప్‌లో ఇన్వెస్ట్ (Investment) చేయగలిగితే... 12 శాతం వార్షిక రిటర్న్‌తో 40 ఏళ్లకు రూ.1.07 కోట్ల మొత్తాన్ని పొందగలరు. గడిచిన 25 ఏళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ పెట్టిన ఎంతోమంది భారీ మొత్తంలో రిటర్న్స్ పొందగలిగారు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి ముందు మార్కెట్ కౌన్సిలర్ సలహాతో ముందుకెళ్లండి.

Also Read: Injured Monkey:కోతి ప్రాణాన్ని కాపాడడం కోసం మనిషి ఏం చేశాడంటే?.. వీడియో చూస్తే షాకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News