Rupee To Dollar: ఇవాళ (శుక్రవారం) రూపాయి విలువ యూఎస్‌డీ(USD)కి 79.12 వద్ద స్థిరపడింది. గత రెండురోజులుగా భారతీయ కరెన్సీ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని తాకింది. ఐతే యూఎస్‌డీ(USD)కి రూ. 79 తగ్గడం ఇదే తొలిసారి. డాలర్‌కు 78.98 వద్ద ప్రారంభమై తర్వాత వన్ యూఎస్‌డీకి వ్యతిరేకంగా 79.12ను తాకింది. భారతీయ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐ(FII)లు వేగంగా నిష్క్రమించడం, బలహీనమైన స్థూల సూచికలు దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత కరెన్సీ పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రయత్నిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఆర్థికంగా భారత్ బలోపేతంగా ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వెల్లడించారు. నికర విక్రయదారులు ఉండటం రూపాయి పతనానికి కారణంగా మారుతోందని తెలుస్తోంది. కరెన్సీ పతనాన్ని ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే బంగారంపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు.
పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్ ఎగుమతులపై పన్నులు పెంచుతున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.6 పన్ను పెంచారు. డీజిల్‌పై లీటర్‌కు రూ.13 చొప్పున పెంచారు. ఈనిర్ణయం దేశీయంగా పెట్రోల్ ధరలపై ప్రభావం చూపదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపాయి పతనాన్ని నియంత్రించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. రూపాయి విలువ మరింత పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Rain Alert: దేశమంతటా విస్తరించిన నైరుతి రుతు పవనాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read: Nupur Sharma: నుపుర్ శర్మ అభ్యర్థనకు నో..క్షమాపణ చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టీకరణ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook