RAC Ticket Holders Benefits: రైళ్లలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందుగా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే.. అందుకు అనుగుణంగా రైల్వే టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు. కానీ అనుకోకుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేస్తే.. ఒక్కోసారి ఆర్ఏసీ (Reservation Against Cancellation) వస్తుంది. అంటే సీటు కన్ఫార్మ్ అయిన ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకుంటే.. ఆర్‌ఏసీలో ఉన్న వాళ్లకు బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది. ఒకవేళ బెర్త్ కన్ఫార్మ్ కాకపోతే.. ఆర్ఏసీలో ఉన్న వాళ్లకు కూర్చొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఒక బెర్త్‌ను ఇద్దరికి కేటు ఇస్తారు. ఇద్దరు సగం సీటు పంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఏసీ క్యాబిన్‌లో ఆర్‌ఏసీ టికెట్ ఉంటే దిండు, షీట్, దుప్పటి తదితర సౌకర్యాలు లభిస్తాయా లేదా అనేది చాలా మందికి డౌట్‌గా ఉంటుంది. ఆర్‌ఏసీ టికెట్‌తో ఒకే బెర్త్‌లో ఇద్దరు ప్రయాణిస్తే ఇస్తారా..? లేదా..? చాలా మంది అడుగుతున్నారు.
ఆర్‌ఏసీ టికెట్ లభిస్తే.. కేవలం కూర్చొవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవతలి వైపు మరోకరు ఉండడంతో పడుకోవడానికి అవకాశం ఉండదు. ఒకేవేళ అవతలి ప్రయాణికుడు అంగీకారంతో కాసేపు అడ్జస్ట్ చేసుకుని పడుకోవచ్చు. ప్రయాణంలో ఎక్కడైన బెర్త్‌లు ఖాళీ అయినా.. ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. ఆ బెర్త్‌లు ఆర్‌ఏసీలో ఉన్న వాళ్లకు లిస్టు ప్రకారం టీటీ కేటాయిస్తారు.
ఒక వేళ ఏసీ కోచ్‌లో దిండు, దుప్పటి, బెడ్‌షీట్ ఇద్దరిలో ఎవరికి ఇస్తారని చాలామందికి అనుమానం ఉంటుంది. గతంలో ఆర్‌ఏసీ ప్రయాణికులకు ఈ సదుపాయం ఉండేది కాదు. దీంతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులు చలికి ఇబ్బంది పడేవారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2017 నుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా బెడ్‌షీట్, దుబ్బటి, దిండు సౌకర్యాన్ని కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇప్పుడు ఆర్ఏసీ సీటుపై కూర్చున్న ప్రయాణికులిద్దరికీ దిండు, బెడ్‌షీట్, దుప్పటి అందజేస్తారు.
సీటు కన్ఫార్మ్ అయినవారికి ఒక దిండు, రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటితో పాటు టవల్ కూడా ఇస్తారు. ఆర్‌ఏసీ ఉన్న వాళ్లకు బెర్త్‌లు లభిస్తే.. వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్లకు ఆర్‌ఏసీ సీటు లభిస్తుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు బెర్త్ కన్ఫార్మ్ అవ్వకపోతే.. ఆ రైలులోని జనరల్ కంపార్డ్‌మెంట్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
Also Read: Chukkala Bhoomulu Rights: చుక్కల భూముల రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు
Also Read: Rain Alert for AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడు రోజుల్లో వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి