Indian Railway Locomotive Headlight: నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే రైళ్ల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు గురించి తెలిస్తే.. మీరు అవునా అని ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైలు నెట్‌వర్క్ మనదే. మన దేశ రైల్వే చరిత్ర చాలా పురాతనమైనది. దేశంలో దాదాపు 68,600 కిలోమీటర్లు రైలు నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మన దేశంలో మొదట రైల్వే ట్రాక్‌లు బ్రిటిష్ వారి కాలంలో వేశారు. రైళ్లు రాకపోకలకు రాత్రి, పగలుతో సంబంధం లేదు. ముఖ్యంగా రాత్రి వేళ రైలు ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది. రైలు ఇంజిన్‌పై హెడ్‌లైట్‌ను గమనించారా..? గమనించే ఉంటారు కానీ.. వాటి గురించి పెద్దగా ఆరా తీసి ఉండరు. రైలు హెడ్‌లైట్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
లోకోమోటివ్‌లో మూడు రకాల లైట్లు
రైలు ఇంజిన్‌కు మూడు రకాల లైట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధాన హెడ్‌లైట్. ఇది దారిని చూడటానికి ఉపయోగపడుతుంది. మిగిలిన రెండు లైట్లలో ఒకటి తెలుపు , మరొకటి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ లైట్లను లోకోమోటివ్ సూచికలు అంటారు. గతంలో లోకోమోటివ్‌పై హెడ్‌లైట్‌ను ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త ఇంజిన్లలో హెడ్‌లైట్‌ను మధ్యలోకి మార్చారు. హెడ్‌లైట్ 24 వోల్ట్ డీసీ కరెంట్‌తో పనిచేస్తుంది. దీని దృష్టి దాదాపు 350-400 మీటర్ల దూరం వరకు వస్తుంది. ఈ శక్తివంతమైన హెడ్‌లైట్ వెలుతురులో లోకో పైలట్లు రాత్రి సమయంలో రైల్వే ట్రాక్‌ను చాలా స్పష్టంగా చూడగలుతారు.
ఈ హెడ్‌లైట్‌లో ప్రస్తుతం రెండు బల్బులు వినియోగిస్తున్నారు. ఈ రెండు బల్బులను సమాంతరంగా ఏర్పాటు చేస్తారు. రాత్రి సమయంలో రైలు వెళ్లే దారిలో ఒక బల్బు ఫెయిల్ అయినా.. మరో బల్బు సాయంతో దారి చూడొచ్చు. అందుకే హెడ్‌లైట్‌లో రెండు బల్బులను వాడుతున్నారు.
రైలు ఇంజిన్‌లో హెడ్‌లైట్‌తో పాటు రెడ్, వైట్ కలర్స్‌తో రెండు లైట్లను ఒకేసారి అమర్చారు. ఇంజిన్‌ను షంటింగ్ కోసం రివర్స్ దిశలో నడపాల్సి వచ్చినప్పుడు.. ఆ సమయంలో రెడ్ లైట్‌ను లోకో పైలట్లు ఉపయోగిస్తారు. దీంతో రైలు ఇంజిన్ షంటింగ్ కోసం వ్యతిరేక దిశలో వెళుతున్నట్లు రైల్వే సిబ్బందికి అర్థం అవుతుంది. ఇంజిన్ షంటింగ్ కోసం ముందుకు వెళుతున్నప్పుడు వైట్ లైట్ ఆన్ చేస్తారు.
Also Read: MS Dhoni Six Video: ధోని సిక్సర్లు.. కూతురు జీవా సంబురాలు.. వీడియోలు చూశారా..!
Also Read: Lalit Yadav Catch Video: ఢిల్లీ బౌలర్ సూపర్ క్యాచ్.. షాక్‌లో అంపైర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook