Hyundai Motors: హ్యుండయ్ మోటార్స్ నుంచి త్వరలో ఐపీవో, ఆసక్తి చూపిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్లు

Hyundai Motors: షేర్ మార్కెట్‌లో కొత్త కొత్త కంపెనీల ఐపీవోలు వస్తున్నాయి. తాజాగా మరో ప్రఖ్యాత కంపెనీ ఐపీవోకు సిద్ధమౌతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఐపీవో కోసం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2024, 07:03 PM IST
Hyundai Motors: హ్యుండయ్ మోటార్స్ నుంచి త్వరలో ఐపీవో, ఆసక్తి చూపిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్లు

Hyundai Motors: ఇండియాలో గత కొద్దికాలంగా వాహన పరిశ్రమ మంచి లాభాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వాహన పరిశ్రమ ఆశించిన మేర లాభాలు ఆర్జించకపోయినా ఇండియాలో ఊపందుకుంటుంది. అందుకే ప్రముఖ అంతర్జాతీయ వాహన తయారీ కంపెనీ ఐపీవో విడుదల చేయనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 

చాలా కాలంగా ఇండియన్ కార్ మార్కెట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ కంపెనీ హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పేరుతో మరోసారి హల్‌చల్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఈసారి అంటే ఈ ఏడాది దీపావళి నాటికి ఇండియాలో ఐపీవో విడుదల చేయనుంది. 1996లో ఏర్పాటైన ఈ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో త్వరలో లిస్టింగ్ కానుంది. దేశంలో మారుతి సుజుకి తరువాత అత్యధికంగా విక్రయమయ్యే కార్లలో హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్థానం ఉంది. హ్యుండయ్ కంపెనీ కార్లకు అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. హ్యుండయ్ వెన్యూ, క్రెటా, ఐ10, ఐ20 ఇలా దాదాపు అన్ని మోడల్ కార్లు మార్కెట్‌లో హిట్ అయినవే. అందుకే ఈ కంపెనీ నుంచి ఐపీవో వస్తుందనగానే ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే గోల్డ్‌మన్ శాచ్స్, సిటీ, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్‌ఎస్‌బిసి, డ్యూయిష్ బ్యాంక్, యూబీఎస్ ప్రతినిధులు ఇటీవల దక్షిణ కొరియాలో హ్యుండయ్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. 

హ్యుండయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ విలువ 22 నుంచి 28 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మార్కెట్ వాటా 1.82 నుంచి 2.32 లక్షల కోట్లు ఉండవచ్చు. మరో 3.3-5.6 బిలియన్ డాలర్లు సమీకరించేందుకు ఐపీవో ప్రవేశపెట్టాలని హ్యుండయ్ ఆలోచిస్తోంది. 

Also read: AP TET Notification 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, రేపట్నించి దరఖాస్తుల స్వీకరణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News