HDFC FD Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు..!

HDFC Fixed Deposits: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్‌డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ‌్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : May 29, 2023, 06:33 PM IST
HDFC FD Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు..!

HDFC Fixed Deposits: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ కాలం వ్యవధిలో ఎక్కువ వడ్డీ రేటు వచ్చే విధంగా ఈ స్కీమ్‌లను డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ ఎడిషన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను పరిచయం చేసింది. 35 నెలల కాలవ్యవధికి 7.20 శాతం, 55 నెలల కాలవ్యవధికి 7.25 శాతం వడ్డీతో రెండు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను ప్రవేశపెట్టింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 నుంచి 29 రోజుల మధ్య ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 నుంచి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 3.50 శాతం వడ్డీ రేటను ఆఫర్ చేస్తోంది. 46 రోజుల నుంచి ఆరు నెలలలోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది. ఆరు నెలల ఒక రోజు నుంచి తొమ్మిది నెలలలోపు డిపాజిట్లపై బ్యాంక్ 5.75 శాతం, 9 నెలల ఒక రోజు నుంచి ఒక ఏడాది కంటే తక్కువ డిపాజిట్లకు 6 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 

ఒక ఏడాది నుంచి 15 నెలలలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.60 శాతం వడ్డీ రేటును, 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 18 నెలల నుంచి రెండేళ్ల 11 నెలలలోపు డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

తాజాగా 35 నెలల కాలవ్యవధితో ప్రత్యేక ఎడిషన్ ఎఫ్‌డీని ప్రవేశపెట్టింది. సాధారణ కస్టమర్లకు 7.20 శాతం వడ్డీ రేటును, నాలుగేళ్ల 7 నెలల కాలవ్యవధిపై 7.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది 55 నెలల కాలవ్యవధిలో కొంత రేటు పెంచింది.  7.25 శాతం అందజేస్తున్నట్లు వెల్లడించింది. మిగిలిన అన్ని కాలవ్యవధిలో 7 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నట్లు తెలిపింది. 

Also Read: Aadhaar Card Update: జూన్ 14వ వరకు ఫ్రీ సర్వీస్.. ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి  

Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News