Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Rate Today: బంగారం ధర మరోసారి ఆకాశాన్ని తాకుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, స్టాక్ మార్కెట్ ఒడుదుడుకుల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ఇప్పుడు రూ.55 వేలకు చేరింది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారపు విక్రయ ధరలు ఇలా ఉన్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 11:13 PM IST
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Rate Today: బంగారం ధర మన దేశంలో రికార్డు స్థాయికి చేరింది. దేశంలోని పలు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల ఎగువకు చేరుకుంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారాని రూ. 427 ధర పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రా. సువర్ణం ధర రూ. 54,377గా ఉంది. 

మెట్రో నగరాల్లో బంగారం ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పది గ్రాముల బంగారం ధర రూ. 54,283కు చేరుకుంది. మరోవైపు పశ్చిమ బంగాల్ రాజధాని కోల్ కతాలో రూ. 54,700 పసిడి ధర చేరింది. చెన్నైలో రూ. 54,770 గా బంగారం ధర కొనసాగుతుంది. 

బంగారంతో పాటు కిలో వెండి ధర కూడా బాగా పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.710 పెరగడం వల్ల దాని ధర రూ. 71,318కి చేరుకుంది. ఇకపోతే ముంబయిలో రూ.71,878 కిలో వెండి ధర ఉండగా..  కోల్‌కతాలో రూ.71700, చెన్నైలో రూ.76,700లుగా వెండి ధర కొనసాగుతుంది.   

Also Read: Airtel Axis Credit Card: ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. యాక్సిస్ క్రెడిట్ కార్డులతో చెల్లింపులపై భారీగా ఆఫర్లు!

Also Read: Flipkart Samsung TV: రూ.21 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ టీవీని రూ.6 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News