Todays Gold: మళ్లీ పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. దేశంలో వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2022, 09:44 AM IST
 Todays Gold: మళ్లీ పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. గత కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. దేశంలో వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిణామాల కారణంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైప్పటి నుంచి బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అయితే గత కొద్దిరోజుల్నించి స్వల్పంగా తగ్గుదల కన్పించినా..మళ్లీ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరల ఇవాళ ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 100 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 340 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 730 రూపాయలుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 100 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి ధర 48 వేల 100 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 100 రూపాయలైతే..24 క్యారెట్ల 10 గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 100 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 100 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 470 రూపాయలుంది.

Also read: Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News