దేశవ్యాప్తంగా బంగారం ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఇవాళ వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, ధరలు, రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, బంగారంపై వడ్డీ, ద్రోవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధర మారుతుంటుంది. నిన్న బంగారం ధర (Gold Price)దేశంలో స్వల్పంగా తగ్గింది. దేశంలో హైదరాబాద్, బెంగళూరు, కోల్కత్తా, విజయవాడ నగరాల్లో స్వల్పంగా తగ్గగా..డిల్లీ, ముంబై నగరాల్లో కాస్త పెరిగింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో (Delhi Gold Price) 22 క్యారెట్ల 10 బంగారం ధర 47 వేల 210 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51 వేల 5 వందలుగా ఉంది. ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర 47 వేల 320 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48 వేల 320 రూపాయలుగా ఉంది. కోల్కత్తా నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర 46 వేల 990 రూపాయలైతే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 690 రూపాయలుంది. ఇక బెంగళూరు నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర 45 వేల 40 రూపాయలైతే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 140 రూపాయలుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్ (Hyderabad Gold Price)నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర 45 వేల 40 రూపాయలు కాగా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల140 రూపాయలు పలుకుతోంది.ఇక విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర 45 వేల 40 రూపాయలైతే..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49 వేల 140 రూపాయలుంది.
Also read: Reliance Jio: యూజర్లకు రిలయన్స్ జియో షాక్- ఛార్జీలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook