Todays Gold Price: బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావంతో గత కొద్దిరోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో పది గ్రాముల బంగారం 4 వేల వరకూ పెరిగింది. ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు ప్రభావం చూపిస్తుంటాయి. వివిధ దేశాల మధ్య నెలకొన్న భౌతిక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరగడమనేది చాలా అరుదు. ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 950 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 4 వందలుంది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 410 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 810 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Also read: Gold in India: ధర పెరుగుతున్నా.. తగ్గని బంగారం కొనుగోళ్లు, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook