Gold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 16, 2024, 07:38 AM IST
 Gold and Silver Rates Today:పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and Silver price Today: బంగారం, వెండి కొనుగోలు  చేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే వెంటనే కొనండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయ. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. శ్రావణమాసంలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బంగారం కొనాలనుకునేవారికి తగ్గుతున్న ధరలు ఊరటనిస్తున్నాయి. గురువారం స్వల్పంగా తగ్గిన ధర నేడు శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు పది గ్రాముల బంగరం ధర రూ. 250 వరకు తగ్గింది. 

ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు బంగారం. మన దేశంలో అయితే బంగారానికి డిమాండ్ భారీగానే ఉంటుంది. సందర్భం ఏదైనా సరే బంగారం కొనుగోలు చేయాల్సిందే. బంగారం, వెండి అంటే భారతీయులకు ఎక్కడాలేని ఆసక్తి ఉంటుంది. శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టిన సమయంలో బంగారం ధర ఏకంగా 4వేల రూపాయలు తగ్గింది. దీంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధరలు ఇంకా తగ్గుముఖం పడుతాయని ఆశించారు. కస్టమ్ సుంకం తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గింది. అయితే రెండు మూడు రోజల తర్వాత బంగారం ధర ఒక్కసారిగా మళ్లీ పెరిగింది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలా వద్దా అనే సందిగ్ధత నెలకొంది. 

శ్రావణమాసం ప్రారంభం అవ్వడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతాయా లేదా అని ఎదురుచూశారు. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర పసిడి ప్రియులకు షాకిచ్చాయి. అయితే గత మూడు రోజులుగా మళ్లీ బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం తగ్గిన బంగారం ధర నేడు శుక్రవారం కూడా భారీగానే తగ్గింది. శుక్రవారం ఉదయం 6. 30గంటల వరకు 24,22 క్యారెట బంగారం ధర  పది గ్రాములకు రూ. 250 తగ్గింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 71,500ఉండగా..22క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 65,540కి చేరింది. 

Also Read : PSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవి  

దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌లో రూ. 71,500, రూ. 65,540, విజయవాడలో రూ. 71,500, రూ. 65,540, ఢిల్లీలో రూ. 71,650, రూ. 65,690, చెన్నైలో రూ. 71,500, రూ. 65,540,సూరత్‌లో రూ. 71,550, రూ. 65,590, ముంబైలో రూ. 71,500, రూ. 65,540, బెంగళూరులో రూ. 71,500, రూ. 65,540, కోల్‌కతాలో రూ. రూ. 71,500, రూ. 65,540, కేరళలో రూ. 71,500, రూ. 65,540గా ఉన్నాయి. 

అటు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గి రూ. 83,600కు చేరింది. 

ఢిల్లీలో రూ. 83,600,బెంగళూరులో రూ.79,900,విజయవాడలో రూ. 88,600,హైదరాబాద్‌లో రూ. 88,600,చెన్నైలో రూ. 88,600,గోవాలో రూ. 79,900,
కేరళలో రూ. 88,600, ఇండోర్‌లో రూ. 83,600

Also Read : Post Office Scheme : నెలకు రూ. 555 మీవి కాదనుకొని పోస్టాఫీసులోని ఈ స్కీంలో కడితే చాలు రూ. 10 లక్షలు మీ సొంతం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News