Go First Offering Discount: రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే విమాన ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్​!

ఒమిక్రాన్​ వేరియంట్ భయాల నేపత్యంలో దేశీయ బడ్జెట్​ విమానయాన సంస్థ గో ఫస్ట్ వ్యాక్సినేషన్​ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్​ తీసుకుంటే.. దేశీయంగా విమాన ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్​ను ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 10:47 AM IST
  • దేశీయ విమాన ప్రయాణికులకు గో ఫస్ట్ అదిరే ఆఫర్​
  • రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే 20 శాతం డిస్కౌంట్​
  • వ్యాక్సినేషన్​ను ప్రోత్సహించేందుకేనని వెల్లడి
Go First Offering Discount: రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే విమాన ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్​!

Go First: దేశవ్యాప్తంగా కరోనా భయాలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఆందోళన (Omicron scare) కలిగిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కొవిడ్​ థార్డ్​ వేవ్ (Covid Third wave)​ రావచ్చని అంచనాలు ఆందోళనలను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.

కరోనా కట్టడిలో భాగంగా పలు ప్రైవేటు సంస్థలు కూడా వినూత్నంగా తమ వంతు సహాయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ 'గో ఫస్ట్​' సరి కొత్త ఆఫర్​ను (Go first special offer) ప్రకటించింది.

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) తీసుకున్న దేశీయ ప్రయాణికులు.. టికెట్ ఛార్జీలపై 20 శాతం వరకు డిస్కాంట్​​ పొందొచ్చని తెలిపింది.

ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని దేశీయంగా ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్​ వర్తిస్తుందని గో ఫస్ట్​ స్పష్టం చేసింది.

ఆఫర్​పై టికెట్ బుక్​ చేసుకున్న ప్రయాణికులు.. బుకింగ్​ తేదీ నుంచి 15 రోజుల తర్వాతే ప్రయాణ తేదీని ఎంచుకోవచ్చని తెలిపింది. ఎవరైతే ఈ ఆఫర్​ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ప్రయాణ తేదీ రోజు ప్రభుత్వం జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్​లో కూడా వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ను చూపించొచ్చని వెల్లడించింది.

తమ వినియోగదారులందరి భద్రతకు కట్టుబడి ఉన్నామని.. ఇందులో భాగంగానే తమ సిబ్బంది అందరికి ఇప్పటికే టీకా కార్యక్రమం పూర్తయినట్లు వెల్లడించింది గో ఫస్ట్​. ఇప్పుడు ఇతరులను కూడా వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్​ ప్రకటించినట్లు వివరించింది.

మరో బడ్జెట్ విమానయనాన సంస్థ ఇండిగో కూడా.. ఇప్పటికే ఇలాంటి ఆఫర్​ను ప్రకటించడం గమనార్హం. వ్యాక్సిన్​ తీసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇంతకు ముందే ఇండిగో ప్రకటించింది.

Also read: Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది

Also read: 2021 Electric Vehicles: దేశంలో 25 లక్షలకు దిగువన అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News