Meta Layoffs: మరోసారి షాక్ ఇవ్వనున్న మెటా.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

Facebook Layoffs 2023: టేక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మెటా మరోసారి భారీగా ఉద్యోగులను సాగనంపించేందుకు రెడీ అవుతోంది. గతేడాది 11 వేల మందిని తొలగించిన మెటా.. మళ్లీ అదేస్థాయిలో లేఆఫ్‌లు ప్రకటించనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2023, 03:42 PM IST
Meta Layoffs: మరోసారి షాక్ ఇవ్వనున్న మెటా.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..!

Facebook Layoffs 2023: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. వచ్చే వారం రెండవ రౌండ్‌లో అదనపు తొలగింపులు చేపట్టనుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 13 శాతం.. అంటే దాదాపు 11 వేల మంది ఉద్యోగాల్లో కోత పెట్టే అవకాశం కనిపిస్తోంది. నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వారు మొదట తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. మెటా ప్లాట్‌ఫారమ్‌లు రాబోయే నెలల్లో అదనపు తొలగింపులను ప్రకటించాలని యోచిస్తోంది.
 
ఈ లేఆఫ్‌లతో కంపెనీ కొన్ని ప్రాజెక్ట్‌లు, టీమ్‌లను కూడా మూసివేస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉద్యోగాల కోతలు మెటా, హార్డ్‌వేర్, మెటావర్స్ వర్టికల్స్‌తో పాటు ప్రస్తుతం బిలియన్ డాలర్ల బడ్జెట్‌లను కలిగి ఉన్న రియాలిటీ ల్యాబ్‌లలోని ప్రాజెక్ట్‌లను ప్రభావితం చేస్తాయి. రెండవ త్రైమాసికంలో అంచనా వేసిడిన ఉద్యోగ కోతల తుది గణన ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. 

గతేడాది నవంబర్‌లో 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. మెటా వర్క్‌ఫోర్స్‌ను మరింత తగ్గించాలని యోచిస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. తాము కంపెనీని కొంతవరకు మార్చామని భావిస్తున్నట్లు చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా గ్లోబల్ వర్క్‌ఫోర్స్ స్థిరంగా వృద్ధి చెందిందని.. దీనివల్ల నిజంగా సమర్థతను పెంచుకోవడం చాలా కష్టమని ఆయన అన్నారు.

తాము రియాలిటీ ల్యాబ్స్ ఫ్యామిలీలోని యాప్, కంపెనీ రెండింటినీ చూస్తూనే ఉన్నామని.. తమ వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోగలమా లేదా అనేది చెక్ చేసుకుంటున్నామని మెటా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుసాన్ లీ తెలిపారు. అవకాశాల వైపు దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. దీంతో కొన్ని ప్రదేశాలలో ప్రాజెక్ట్‌లను మూసివేయడానికి.. కొన్ని బృందాల నుంచి ఉద్యోగులను తొలగించేలా కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేసిందన్నారు. గత కొంతకాలంగా టేక్ కంపెనీల్లో వరుస లేఆఫ్‌ల ప్రకటనలతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మెటా 11 వేల ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్న నేపథ్యంలో ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయోనని టెన్షన్ పడుతున్నారు.  

Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News