CNG Price: పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతున్న (ఆటోల్లో ఎక్కువగా) సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) ధరలు కూడా క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరమంటున్నారు విశ్లేషకులు.
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.2.5 వరకు పెరిగింది. దీనితో.. కిలో సీఎన్జీ ధర రూ.66.61కు చేరింది. గడిచిన ఐదు రోజుల్లో సీఎన్జీ ధర కిలో రూ.6.6 వరకు పెరగటం గమనార్హం.
వివిధ నగరాల్లో సీఎన్జీ రేట్లు ఇలా..
- హైదరాబాద్‌లో కిలో సీఎన్జీ ధర రూ.75.75 వద్ద ఉంది.
- గ్రేటర్ నోయిడా, గాజియాబాద్‌లో సీఎన్జీ రేటు కిలో రూ.69.18 వద్దకు చేరింది.
- ముజాఫర్‌నగర్, మీరఠ్, సిమ్లాలో కిలో సీఎన్జీ ధర రూ.74.94 వద్దకు పెరిగింది.
- గురుగ్రామ్‌లో సీఎన్జీ ధర కేజీ రూ.74.74 వద్ద ఉంది.
- కాన్పూర్, ఫతేపూర్ వంటి నగరాల్లో కిలో సీఎన్జీ ధఱ రూ.78.40 వద్ద ఉండటం గమనార్హం.
- అజ్మేర్, పలిలో సీఎన్జీ ధర రూ.76.89 (కిలోకు) వద్ద విక్రయమవుతోంది.
మరింత ప్రియమైన పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం 80 పైసల చొప్పున పెరిగాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 వద్దకు పెరగ్గా.. డీజిల్ ధర లీటర్ రూ.96.67కు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయి అయిన రూ.150.51 వద్ద కొనసాగుతోంది (84 పైసలు పెరిగింది.). లీటర్ డీజిల్ ధర రూ.104.77 (85 పైసలు పెరిగి) వద్ద కొనసాగుతోంది.
Also read: Petrol Price Today: ఆగని పెట్రో మోత.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Also read: iPhone Thefts: ఐఫోన్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు యాపిల్ సంస్థ కీలక నిర్ణయం...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook