EPFO Latest Update: ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. పెన్షన్ నగదు మరియు ప్రావిడెంట్ ఫండ్ (Provident)లను విభజించాలని ప్రభుత్వం కొన్ని విషయాలు పరిశీలిస్తోంది. దీని ద్వారా ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు, అతనికి పెన్షన్ నగదు ఎక్కువగా రావాలన్నది ఉద్దేశం. ఈపీఎఫ్‌వో (Employees Provident Fund Organization) సభ్యులుగా ఉన్న ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుంది.
పెన్షన్ ఫండ్ నుండి డబ్బు విత్‌డ్రా వీలుకాదు
ఉద్యోగి నెలవారీ జీతంలోని బేసిక్ శాలరీ నుంచి 12 శాతం, మరియు కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు ప్రతినెలా జమ చేస్తుంది. అయితే ఇందులో 8.33 శాతం వాటా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు జమ కాగా, మిగిలిన మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్‌కు జత చేస్తారు. ఉద్యోగులు తమకు అవసరం అయినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతా నగదుతో పాటు పెన్షన్ ఫండ్ నుంచి సైతం నగదు ఉపసంహరించుకుంటారు. మింట్ కథనం ప్రకారం.. పెన్షన్ ఫండ్ మరియు ప్రావిడెంట్ ఫండ్ వేరు చేస్తే, ఉద్యోగులు పెన్షన్ ఫండ్ డబ్బు (EPFO Good News For PF Subscribers) విత్‌డ్రా చేసుకునే వీలుండదు.
Also Read: UAN-Aadhar Linking: ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన EPFO
కరోనా సమయంలో నగదు విత్‌డ్రా..
పింఛన్ విషయంలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మింట్ కథనం ప్రకారం.. కరోనా వ్యాప్తి తరువాత ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతా, పెన్షన్ మొత్తాన్ని అధిక మొత్తంలో ఉపసంహరించుకున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం సైతం అందుకు ఓ కారణం. గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన సమయంల నుంచి 31 మే 2021 వరకు మొత్తం 76.3 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు కోవిడ్19 అడ్వాన్స్ (Covid-19 Advance) రూపంలో డబ్బును ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్ 1, 2020 నుండి 2021 జూన్ 19 వరకు ఈపీఎఫ్‌వో 3.9 కోట్ల క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేసినట్లు సమాచారం.
ఒక అధికారి మాట్లాడుతూ.. ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ మరియు పెన్షన్ పథకాన్ని వేరు చేయడం ముఖ్యమని చెప్పారు. అవసరమైన సమయంలో ఈపీఎఫ్ ఖాతా నుండి నగదు విత్‌డ్రా చేసుకోవడం తప్పుకాదు. కానీ పెన్షన్ ఖాతా నుంచి అలా చేయకూడదు. ఈపీఎఫ్, ఈపీఎస్ విడగొట్టి వేరు ఖాతాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్యానెల్ సిఫారసు చేసిందని ఆ అధికారి తెలిపారు. ఈ ఏడాది గత కొన్ని నెలలుగా దీనిపై ఈపీఎఫ్ఓ (EPFO), కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్ నగదు సాయం
ఖాతాలు విడగొట్టిన తరువాత సైతం ఈపీఎఫ్ ఖాతాదారుడు తన పెన్షన్ ఫండ్ నుండి ఒకవేళ నగదు ఉపసంహరించుకుంటే, అనంతరం కాలంలో దాని ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తుంది. పదవీ విరమణ తర్వాత ఆ ఖాతాదారుడికి వచ్చే పింఛన్ నగదు తగ్గుతుంది. అనవసరంగా, లేదా కచ్చితమైన ప్రయోజనాలకు కాకుండా ఇతర విషయాలకు నగదు విత్‌డ్రా చేసుకుంటే తదనానంతరం దాని ప్రభావం ఫీఎఫ్ ఖాతాదారులపై పడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook