OLD Pension Scheme: పెన్షన్ విదానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అప్‌డేట్, ప్రత్యామ్నాయమార్గంపై కసరత్తు

OLD Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పాత పెన్షన్ విధానం కొనసాగించవద్దని కేంద్రం పదే పదే చెబుతూనే ఉంది. పాత పెన్షన్ విధానంపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2023, 12:01 PM IST
OLD Pension Scheme: పెన్షన్ విదానంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అప్‌డేట్, ప్రత్యామ్నాయమార్గంపై కసరత్తు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేయమనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానానే కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన అప్‌డేట్ గురించి తెలుసుకుందాం..

ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. అటు ప్రత్యర్ధి పార్టీలు కూడా అధికారంలో వచ్చేందుకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామనే హామీలు ఇస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విదానం అమలు చేయవద్దని పదే పదే సూచిస్తోంది. ఈ నేపధ్యంలో పెన్షన్ విధానంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

పాత పెన్షన్ విధానంపై సర్వత్రా డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో పాత, కొత్త పెన్షన్ విధానాలకు మధ్యేమార్గంగా మరో ప్రత్యామ్నాయం కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానాలకు ప్రత్యామ్నాయంగా కొత్త విధానం ప్రవేశపెట్టే ఆలోచన కన్పిస్తోంది. మొదటి ప్రత్యామ్నాయంలో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ అంటే కొత్త పెన్షన్ విధానం కింద చివరి జీతంలో దాదాపు 50 శాతం గ్యారంటీ పెన్షన్ ప్రతిపాదించవచ్చు.

ఈ విధానం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ ప్రభావం పడకుండానే ఎన్‌పీఎస్‌లో మార్పు చేయవచ్చు. అటు పాత పెన్షన్ విధానంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం చెల్లిస్తారు. ఎన్‌పీఎస్ అనేది ఉద్యోగి తరపున చెల్లించే నగదు ఆధారంగా పెన్షన్ ఉంటుంది. 

ఎన్‌పీఎస్ అంటే ఏమిటి

ప్రస్తుతం నడుస్తున్న కొత్త పెన్ష్ విధానం ఒక రిటైర్మెంట్ పథకం. ఇందులో లబ్దిదారులకు రిటైర్మెంట్ తరువాత ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 60 శాతం తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. మిగిలిన 40 శాతం మొత్తాన్ని నెలవారీ పెన్షన్‌గా అందుకోవచ్చు. అంటే పదవీ విరమణ అనంతరం 60 శాతం ఒకేసారి డబ్బుల్ని తీసుకోవడం మిగిలిన 40 శాతాన్ని నెలవారీ పెన్షన్ నిమిత్తం జమ చేయడం చేయాల్సి ఉంటుంది. ఈ పధకాన్ని ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టింది. 

ఎన్‌పీఎస్‌లో ఒక మార్పు ఉండే అవకాశముంది. రిటైర్మెంట్ తరువాత ఉద్యోగికి ఒకేసారి 41.7 శాతం నగదు లభిస్తుంది. మిగిలిన 58.3 శాతం డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై ఏడాది ఆధారంగా ఇస్తారు. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 14 నుంచి 58.3 శాతం చేస్తే..ఎన్‌పీఎస్‌లో పెన్ష్ అనేది చివరి జీతంలో దాదాపు 50 శాతం ఉండవచ్చు.

Also read: Air India: బాహుబలి డీల్... ఎయిర్ ఇండియాకు 470 కొత్త విమానాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News