Train Journey: రైలు ప్రయాణీకులకు అలెర్ట్‌.. ఇలా చేస్తే ఏడాది జైలుతోపాటు భారీ జరిమానా..

Train Journey Rules:  మీరు ఒకవేళ స్లీపర్‌ కోచ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణించినట్లయితే కూడా తప్పు. ఆ వ్యక్తికి ఏసీ కోచ్‌ టిక్కెట్‌ ధరను జరిమానా విధించడంతోపాటు అదనంగా పెనాల్టీ ఛార్జీలుక కూడా టీటీఈ విధించవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Jul 2, 2024, 12:37 PM IST
Train Journey: రైలు ప్రయాణీకులకు అలెర్ట్‌.. ఇలా చేస్తే ఏడాది జైలుతోపాటు భారీ జరిమానా..

Train Journey Rules: మీరు ట్రైన్‌ జర్నీ చేస్తున్నారా? అయితే, మీకు ఈ రూల్స్‌ తెలిస్తే, ఒకవేళ మీకు ఈ నిబంధన తెలియకపోతే మీకు ఏడాది జైలు శిక్ష, భారీ జరిమానా కూడా విధించవచ్చు. మీరు కూడా రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే కొన్ని రూల్స్‌ తెలుసుకోవాలి. ఇండియన్ రైల్వే భారత అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌. ప్రతిరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. మీరు రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే టిక్కెట్‌ తప్పనిసరి. ఈ రూల్స్‌ అతిక్రమిస్తే పెనల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

మనం తీర్థయాత్రలు చేయాలన్నా, ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నా రైలు ప్రయాణం చేస్తాం. అయితే, ఈ ట్రైన్‌ జర్నీ చేసేవారు కొన్ని రూల్స్‌ తెలుసుకుని ప్రయాణం చేస్తే జరిమానా, జైలు శిక్షను పడకుండా చూసుకోవచ్చు. రైలు ప్రయాణం చేసేవారు టిక్కెట్‌ తప్పనిసరిగా తమతోపాటు తీసుకెళ్లాలి.  లేకపోతే ఆరు నెలలపాటు జైలు శిక్ష మరో వెయ్యి రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు. ఈ జరిమానా దూరాన్ని బట్టి తగ్గించవచ్చు కూడా. 

మీరు ఒకవేళ స్లీపర్‌ కోచ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణించినట్లయితే కూడా తప్పు. ఆ వ్యక్తికి ఏసీ కోచ్‌ టిక్కెట్‌ ధరను జరిమానా విధించడంతోపాటు అదనంగా పెనాల్టీ ఛార్జీలుక కూడా టీటీఈ విధించవచ్చు.

మీరు ఒకవేళ ట్రైన్‌ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని రైలు ప్రయాణం చేస్తున్నట్లయితే మీతోపాటు మీ గుర్తింపు కార్డు కూడా ఉండాలి. ఒకవేళ మీరు ఐడీ కార్డు ఇవ్వకపోయినా టిక్కెట్‌ లేని ప్రయాణం అని టీటీఈ జరిమానా విధిస్తాడు. 

అంతేకాదు ఎవరైనా మద్యం సేవించి రైలు ప్రయాణం చేసినా నిబంధనలు అతిక్రమించినట్లే. అటువంటి వారిని వెంటనే రైలు ప్రయాణం చేయకుండా బయటకు పంపించేస్తారు. అదనంగా రూ. 500 వరకు ఫైన్‌ కట్టాల్సి ఉంటుంది. ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా వేస్తారు.

ఇదీ చదవండి: జియో యూజర్లకు మరో భారీ షాక్‌.. ఎక్కువశాతం రీఛార్జీ చేసుకునే ఆ 2 ప్లాన్లు తొలగింపు..

సెక్షన్‌ 141 భారత రైల్వే యాక్ట్‌ ప్రకారం ఏ కారణం లేకుండా ఎమర్జెన్సీ చైన్‌ లాగితే కూడా ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు లేదా వెయ్యి రూపాయాల వరకు జరిమానా విధించవచ్చు. లేదా ఒక్కోసారి రెండు శిక్షలు కూడా విధించవచ్చు.

ఇదీ చదవండి: ఈ పోస్టు ఆఫీస్‌ పథకంలో పెట్టుబడి పెడితే రూ. 80,000 వడ్డీ వస్తుంది..

ట్రైన్‌ జర్నీ చేస్తున్న సమయంలో పొగ తాగడం కూడా నేరంగా పరిగణిస్తారు.. దీనికి రూ. 200 జరిమానా కూడా విధించవచ్చు.అంతేకాదు ఎవరైనా ఇండియన్‌ రైల్వే యాక్ట్‌ నిబంధన అతిక్రమించి రైల్వే ట్రాక్‌ లేదా ప్లాట్‌ఫారమ్‌ టిక్కెట్‌ లేదా పర్మిషన్‌ తీసుకోకుండా చేస్తే వెయ్యి రూపాయాల జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News