Burer India: బ్యూరర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెట్ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly Brand Ambassador For Beurer India: భారత క్రికెట్‌ మాజీ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ మరో పాత్ర మెరవనున్నారు. దేశంలోనే ప్రముఖ హెల్త్‌ కేర్‌ పరికరాల తయారీ సంస్థ బ్యూరర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 21, 2024, 10:21 PM IST
Burer India: బ్యూరర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెట్ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly: ప్రముఖ హెల్త్‌ కేర్‌ పరికరాల తయారీ సంస్థ బ్యూరర్‌కు ప్రచారకర్తగా భారత క్రికెట్‌ మాజీ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ ఎంపికయ్యారు. గంగూలీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తూ బ్యూరర్‌ ప్రకటన విడుదల చేసింది. అంబాసిడర్‌గా ప్రకటిస్తూనే సంస్థ ఉత్పత్తులను మార్కెట్‌లోకి వదిలింది. గంగూలీకి ఉన్న గుర్తింపు ప్రజలతో తమ కంపెనీ అనుబంధాన్ని మరింత పెంచుతుందని ఆ సంస్థ భావించింది. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తులు తమ సంస్థకు మద్దతుగా నిలవడం సంతోషకరమని బ్యూరర్‌ కంపెనీ సీఈఓ వీఎస్‌ సలీల్‌ తెలిపారు.

Also Read: Google Pay Close: అలర్ట్.. గూగుల్‌ పే సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

 

బెంగళూరులో ఇటీవల జరిగిన కార్యక్రమంలో బ్యూరర్‌ సంస్థ గంగూలీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పరిచయం కార్యక్రమం నిర్వహించింది. తమ సంస్థకు మద్దతుగా నిలవడాన్ని బ్యూరర్‌ సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అనంతరం మేక్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా కొత్త బ్లడ్‌ షుగర్‌ మానిటర్‌ పరికరాన్ని ఆ సంస్థ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ సంస్థ అందిస్తున్న వైద్య ఉత్పత్తుల సేవలు, కార్యక్రమాలను వివరించారు.

Also Read: Bank Holiday on May 20th: సోమవారం బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?

 

వినియోగదారులకు వినూత్న నాణ్యమైన ఉత్పత్తులు అందించడం తమ లక్ష్యమని బ్యూరర్‌ సంస్థ డైరెక్టర్‌ స్టాన్లీ జోసెఫ్‌ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన బ్లడ్‌ షుగర్‌ మానిటర్‌ పరికరం అలాంటిదేనని చెప్పారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. 'ఆరోగ్య రంగం నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. బ్యూరర్‌ సంస్థకు సేవలు అందించడం ఆసక్తిగా ఉంది. దేశంలో హెల్త్‌ కేర్‌ రంగాన్ని మెరుగపరిచేందుకు బ్యూరర్‌ మిషన్‌లో చేరడం చాలా సంతోషాన్నిచ్చింది' అని గంగూలీ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News