Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచే, స్మార్ట్‌టీవీలపై 60 శాతం డిస్కౌంట్

Amazon Great Indian Festival 2023: ఆన్‌లైన్ షాపర్లకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక డిస్కౌంట్ సేల్ సీజన్ ప్రారంభించాయి. రెండు ఏకకాలంలో ప్రత్యేక సేల్ నిర్వహిస్తండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2023, 05:01 PM IST
Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచే, స్మార్ట్‌టీవీలపై 60 శాతం డిస్కౌంట్

Amazon Great Indian Festival 2023: బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ ప్రత్యేక ఆఫర్ సేల్స్ ప్రారంభించనున్నాయి. ఈసారి రెండూ అక్టోబర్ 8 నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 వరకూ నడవనున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ అందనుంది.

దసరా పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో ఈసారి ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై భారీగా 80 శాతం వరకూ డిస్కౌంట్ అందనుంది. వీటిపై 50-80 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుంది. ఇక స్మార్ట్‌టీవీలపై 60 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రైమ్ యూజర్లకు ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 7 నుంచే మెగా సేల్ ఆఫర్లు అందనున్నాయి. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్ ఇలా అన్ని రకాల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది.

స్మార్ట్‌ఫోన్లు 5,699 రూపాయలకు ప్రారంభం కానున్నాయి. 5జి స్మార్ట్‌ఫోన్లు 8,999 రూపాయల నుంచి అందుబాటులో ఉంటాయి. కంపెనీ నేరుగా ఇచ్చే ఆఫర్లు కాకుండా వివిధ బ్యాంకులు ఇచ్చే ఆఫర్లు కూడా వర్తిస్తాయి. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. అమెజాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేస్తే 2500 రూపాయలు వెల్‌కం రివార్డ్ లభిస్తుంది. అమెజాన్ పే గిఫ్ట్ ద్వారా అయితే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రెడ్ మి 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డి టీవీ అసలు ధర 42,999 రూపాయలైతే ఈ సేల్‌లో కేవలం 20,499 రూపాయలకే లభించనుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో 5500 రూపాయలు తగ్గుతాయి.

వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ 43 ఇంచెస్ అసలు ధర 29,999 రూపాయలు కాగా కేవలం 26,999 రూపాయలకే లభిస్తోంది. ఎల్‌జి 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డి స్మార్ట్‌టీవీ అసలు ధర 60,990 రూపాయలు కాగా అమెజాన్ సేల్‌లో కేవలం 40,990 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్ కూపన్ మరో 1000 రూపాయలు లభిస్తుంది. 

ఇక వీయూ 55 ఇంచెస్ క్లో క్యూఎల్ఈడీ అసలు ధర 80 వేలు కాగా కేవలం 62,999 రూపాయలకు పొందవచ్చు. కూపన్స్ ద్వారా మరో 3000 డిస్కౌంట్ ఉంటుంది. ఇక శాంసంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్  టీవీ అసలు ధర 52,900 రూపాయలు కాగా అమెజాన్ సేల్‌లో 32,990 రూపాయలకే లభించనుంది. అదనంగా మరో 1000 రూపాయలు డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. ఇక అన్నింటికంటే తక్కువకు టీసీఎల్ 40 ఇంచెస్ ఎస్ సిరీస్ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 40,990 రూపాయలు కాగా, అమెజాన్‌లో కేవలం 16,990 రూపాయలకే లభిస్తోంది.

Also read: Cash Insurance News: బ్యాంకు లాకర్లలో క్యాష్‌కి ఇన్సూరెన్స్ ఉంటుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News