Air Asia Offers: 1500 రూపాయలకే విమాన టికెట్, కళ్లు చెదిరే ఆఫర్ చివరి తేదీ ఎప్పుడంటే

Air Asia Offers: విమాన ప్రయాణీకులకు అద్భుతమైన ఆఫర్ ఇది. ఎయిర్ ఏసియా సంస్థ న్యూ ఇయర్ డీల్స్ చేపట్టింది. కేవలం 1497 రూపాయలకే విమాన టికెట్ అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 25, 2022, 11:20 PM IST
Air Asia Offers: 1500 రూపాయలకే విమాన టికెట్, కళ్లు చెదిరే ఆఫర్ చివరి తేదీ ఎప్పుడంటే

ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా కొత్త ఏడాది డీల్స్ అందిస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో ప్రయాణం చేయవచ్చు. బెంగళూరు-కొచ్చి టికెట్ అయితే చాలా తక్కువ.

టాటా గ్రూప్ కొనుగోలు అనంతరం ఎయిర్ ఇండియాతో పాటు అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా కార్యకలాపాలు విస్తృతమౌతున్నాయి. ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు వివిధ రకాల ఆపర్లు ప్రకటితమౌతున్నాయి. ఇప్పుడు కొత్త ఏడాది సందర్భంగా ఎయిర్ ఏసియా భారీ ఆఫర్లు ప్రకటించింది. బెంగళూరు-కొచ్చి మార్గం టికెట్ కేవలం 1497 రూపాయలకే అందిస్తోంది. ఇతర మార్గాల్లో కూడా డిస్కౌంట్ రేట్లకు టికెట్లు అందుతున్నాయి. ఎయిర్ ఏసియా అందిస్తున్న విమాన టికెట్ల ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కోసమే ఉంటుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్‌కు ఇవాళే ఆఖరు తేదీ. ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకుంటే జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 వరకూ ప్రయాణం చేయవచ్చు.

ఎయిర్ ఏసియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునేవారికి డిస్కౌంట్ లభిస్తుంది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఆఫర్లు వర్తిస్తాయి. ప్రయారిటీ చెకిన్, బ్యాగేజ్, బోర్డింగ్ వంటివి లభిస్తాయి. 8 శాతం వరకూ నియో కాయిన్స్ అందుతాయి. ఎయిర్ ఏసియా ఇండియా 2014 జూన్ 12 నుంచి నడుస్తూ..50కి పైగా డైరెక్ట్, 100 కనెక్టింగ్ రూట్లలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. 

Also read: Fact Check: జనవరి 1 కొత్త ఏడాది నుంచి వేయి రూపాయల నోటు మళ్లీ రానుందా, నిజమెంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News