భారతీయులకు ప్రభుత్వం జారీ చేసే విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్. యూఐడీఏఐ జారీ చేసే ఆధార్ కార్డు ప్రతి పనికీ కావల్సిందే. ఆధార్ అవసరం ఇప్పుడు దుర్వినియోగానికి దారితీస్తోంది. మరి ఎలా చెక్ పెట్టాలి, ఏం చేయాలి.
ప్రభుత్వ పనైనా, ప్రైవేట్ పనైనా ఆధార్ అన్నింటిక ఆధారమైపోయింది. ఆధార్ కార్డ్ అనేది కీలమైన డాక్యుమెంట్. ఏ పనైనా సరే..ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ నెంబర్ తీసుకోవాలన్నా..బ్యాంక్ ఎక్కౌంట్ తెరవాలన్నా..విద్యుత్ కనెక్షన్ అయినా..నీటి కనెక్షన్ అయినా..ఇళ్లు కొనాలన్నా..ఇంటి అద్దెకైనా ఇలా ఏ పనైనా సరే..ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే ఏ పనైనా సరే అసంపూర్తిగానే ఉంటుంది. ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ కాబట్టే ఆధార్ కార్డు మీకు తెలియకుండానే దుర్వినియోగమైపోతుంది.
అందుకే ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాపీని ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించింది. ఆధార్ కార్డు వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని తెలిపింది. ఆధార్ కార్డును బహిరంగ ప్రదేశాల్లో అంటే పబ్లిక్ కంప్యూటర్లలో ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దని హెచ్చరిస్తోంది.
ఆధార్ లాక్ ఎలా చేయాలి
ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచేందుకు ఆన్లైన్ విధానంలో లాక్ చేసుకోవచ్చు. ఎంఆధార్ యాప్ సహాయంతో ఈ పని చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు మీ బయోమెట్రిక్ లాక్ చేయవచ్చు. దీనికోసం మీకు వర్చువల్ ఐడీ అవసరముంటుంది. ఈ ఐడీ 16 అంకెల రివోకేవల్ నెంబర్ ఉంటుంది. ఈ పదహారంకెల నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో పాటు మ్యాప్ చేస్తారు. దీనిని ఆధార్ హెల్ప్‌లైన్ నెంబరా 1947 పై ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు. ఇలా మీ ఆధార్ కార్డును మీరు లాక్ చేసుకోవచ్చు.
మాస్క్ ఆధార్ అంటే ఏమిటి
మాస్క్డ్ ఆధార్ విధానం మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది.ఈ కార్డును మీరు అనధికారిక సంస్థలకు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల మీ ఆధార్ నెంబర్ సురక్షితంగా ఉంటుంది. దీనిని మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మొదటి 8 అంకెల స్థానంలో ఇంటూ మార్క్స్ ఉంటాయి.
మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచేందుకు మరో విధానం ఈమెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్‌తో లింక్ చేయడం. ఇది చాలా అవసరం. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ రెండింటి ద్వారా మీరు మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేయవచ్చు. ఆన్ వెరిఫికేషన్ కోసం myaadhaar.uidai.gov.in/verifyAadhaar క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఆధార్‌పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చేయవచ్చు.
Also read: Fusion Microfinance: తొలిరోజు 12 శాతం సబ్స్క్రిప్షన్ నమోదు చేసిన ఇష్యూ, నవంబర్ 15న లిస్టింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook