Aadhaar Card: యూఐడీఏఐ అప్‌డేట్, మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్‌లోడ్

Aadhaar Card: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుుడు మరో వెసులుబాటు కల్పించింది. మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2023, 04:19 PM IST
Aadhaar Card: యూఐడీఏఐ అప్‌డేట్, మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్‌లోడ్

ఆధార్ కార్డు హోల్డర్లకు అవసరమైన సమాచారమిది. నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధార్ కావల్సి వస్తోంది. బ్యాంకు ఎక్కౌంట్ ఓపెన్ చేయాలన్నా..సిమ్ కావాలన్నా, ప్రభుత్వ, ప్రైవేటు పనులకు అన్నింటికీ ఇదే ఆధారంగా మారింది. అందుకే ఆధార్ కార్డు హోల్డర్లకు ఎప్పటికప్పుడు వెసులుబాట్లు అందుతున్నాయి.

సాధారణంగా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా కావల్సి వస్తుంది. కానీ ఆ అవసరం లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో అయితే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ఆధార్‌తో అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పకుండా అవసరమయ్యేది. 

ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఈ ప్రకటన చేసింది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని. మెబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి..మై ఆధార్ ట్యాప్ చేయాలి. తరువాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ స్థానంలో 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..నా మొబైల్ నెంబర్ ధృవీకరణ కాలేదు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే కొత్త పేజ్‌కు రీడైరెక్ట్ అవుతారు. 

రీప్రింటింగ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు ప్రింట్ ప్రివ్యూ కన్పిస్తుంది. చివరిగా మేక్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పేమెంట్ ప్రక్రియ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. 

Also read: Bank Holidays: ఏప్రిల్ 2023లో 15 రోజులు పనిచేయని బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News