Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

Buy Hyundai Creta Only RS 2 Lakhs on EMI. హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ E మరియు రెండవ బేస్ వేరియంట్ EXలకు 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 8, 2023, 04:43 PM IST
Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

Take Home a New Hyundai Creta just RS 2 Lakhs on Loan: భారత ఆటో మార్కెట్లో 'హ్యుందాయ్ క్రెటా' కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగానికి హ్యుందాయ్ క్రెటా రాజు. హ్యుందాయ్ క్రెటాలో మొత్తం రెండు డజనుకు పైగా వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.84 లక్షల నుంచి రూ. 19.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హ్యుందాయ్ క్రెటా కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు బేస్ వేరియంట్ E (పెట్రోల్) మరియు రెండవ బేస్ వేరియంట్ EX (పెట్రోల్)లకు రెండు లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

Hyundai Creta E Manual Petrol:
కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఎలా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చో ఓసారి చూద్దాం. హ్యుందాయ్ క్రెటా-E (1.5-లీటర్ పెట్రోల్ 6-స్పీడ్-మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 10.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 12.57 లక్షలు (ఢిల్లీ)గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. దీని కోసం రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. దాదాపు రూ.10.57 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దానిపై 9 శాతం వడ్డీ రేటును ఉండి, లోన్ వ్యవధిని 5 సంవత్సరాలు పెట్టుకుంటే.. అప్పుడు ప్రతి నెలా దాదాపు రూ. 21,942 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు తీసుకున్న రుణంపై మొత్తం రూ. 2.59 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

Hyundai Creta EX Manual Petrol:
హ్యుందాయ్ క్రెటా- EX (మాన్యువల్, పెట్రోల్) యొక్క రెండవ బేస్ వేరియంట్ ధర రూ. 11.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ. 13.64 లక్షలు (ఢిల్లీ)గా ఉంది. ఇప్పుడు ఈ కారు కోసం రూ.2 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఫైనాన్స్ చేస్తే.. దాదాపు రూ.11.64 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుణంపై 9 శాతం వడ్డీ రేటును వర్తించి, 5 సంవత్సరాల వ్యవధిని ఎంచుకుంటే.. అప్పుడు ఈఎంఐ దాదాపు రూ. 24,163గా ఉంటుంది. అప్పుడు మొత్తం దాదాపు రూ.2.85 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

గమనిక:
మీరు ఫైనాన్స్ కోసం వెళ్లే ముందు.. మీ సమీపంలోని హ్యుందాయ్ మోటార్స్ డీలర్‌షిప్‌ని సందర్శించండి. అక్కడ హ్యుందాయ్ క్రెటా- EX (మాన్యువల్, పెట్రోల్), హ్యుందాయ్ క్రెటా-E (1.5-లీటర్ పెట్రోల్ 6-స్పీడ్-మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఫైనాన్స్ వివరాలను అడిగి వివరాలు తెలుసుకోండి. వాస్తవానికి పైకి పేర్కొన్న వడ్డీ రేటు కూడా భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి రుణం, మొత్తంలో తేడా కనిపిస్తుంది. పైన పేర్కొన్న వివరాలు ఢిల్లీలో ఉన్న ఉన్న రేట్లు. 

Also Read: RCB IPL Titles: అతడు కెప్టెన్‌గా ఉండి ఉంటే.. ఆర్‌సీబీ మూడు ఐపీఎల్‌ టైటిల్స్ గెలిచేది: వసీమ్ అక్రమ్‌  

Also Read: Sony Xperia 1 V: అద్భుత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్న సోనీ.. డిజైన్ చూసి కొనకుండా ఉండలేరు! ఐఫోన్ కూడా మర్చిపోవాల్సిందే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News