Borugadda Anil Kumar: పవన్ కళ్యాణ్‌పై బూతులతో రెచ్చిన వైసీపీ నేత.. హ్యాంగర్‌కు ఉన్న చొక్కా వేసుకుని వస్తా..

Borugadda Anil Kumar On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. 'వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా.. నీ సంగతి చూస్తా' అంటూ దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 06:28 PM IST
  • వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియో వైరల్
  • పవన్ కళ్యాణ్‌పై నోటికి వచ్చినట్లు బూతులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన ఫ్యాన్స్‌
Borugadda Anil Kumar: పవన్ కళ్యాణ్‌పై బూతులతో రెచ్చిన వైసీపీ నేత.. హ్యాంగర్‌కు ఉన్న చొక్కా వేసుకుని వస్తా..

Borugadda Anil Kumar On Pawan Kalyan: సీఎం జగన్ ఆర్డర్ ఇస్తే.. చంద్రబాబు, నారా లోకేష్‌ను చంపేస్తానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్.. మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై బండ బూతులతో రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

'సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి మూడు రాజధానులపై స్టాండ్ తీసుకున్నారు. త్వరలోనే మూడు రాజధానుల బిల్లు పాస్ అవుతుంది. నువ్వు కాదు కాదా.. ఎవరు వచ్చినా ఆపడం మీ తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో..

వైజాగ్ వస్తున్నావ్ కదా.. రా నా కొ.. రా.. నీ సంగతి అక్కడే తేల్చకపోతే నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. వెయిటింగ్ నా కొ.. రా చూసుకుందాం. నీ ఫ్యాన్స్ వస్తారా..? ఎవరైనా ఫ్యాన్స్ వస్తారా..? కొందరు 2024 లో పీకే సీఎం అవుతాడని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు, లోకేష్‌కు చెప్పా.. ఇప్పుడు నీకు చెబుతున్నా.. విను.. మీరు 2024 వరకు ఆగాలి. నేను ఇంట్లో ఉన్న హ్యాంగర్‌కు వేసుకున్న చొక్కా వేసుకుని వస్తే.. అన్ని తెగిపోతాయి.. 

నీ పెళ్లాలను, నీ పిల్లలను వెతికి మరి నాకు అప్పగించాలి. రా వైజాగ్‌కు రా.. నువ్వు మూడు రాజధానుల గర్జనను అడ్డుకో.. నీకు సలాం కొడతా.. లేకపోతే రాజకీయాలకు శాశ్వతంగా నమస్కారం చెప్పాలి. నీ పనులు అన్ని చంద్రబాబు ఇంటి దగ్గర వెళ్లి చేసుకో..' అంటూ అనిల్ కుమార్ రెచ్చిపోయి మాట్లాడారు. 

ఈ వీడియోపై జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అనిల్ కుమార్ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి కనిపిస్తే తమకు చెప్పాలని అడుగుతున్నారు. 
 

Also Read: లేడీ స్నేక్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన బ్లాక్ కింగ్ కోబ్రా.. 'తగ్గేదేలే' అంటూ ఒట్టిచేతులతో పట్టేసుకుంది!

Also Read: Minister Srinivas Goud: తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News