Ys Sharmila Son Wedding: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు , సోదరి షర్మిలకు మధ్య అభిప్రాయబేధాలున్నాయి. అయితే ఆమె కుమారుడి నిశ్చితార్ధానికి జగన్ హాజరయ్యారు. కానీ ఇప్పుుడు పెళ్లికి హాజరౌతారనేది సందేహంగానే ఉంది. దీనికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్ధం జనవరి 17వ తేదీన హైదరాబాద్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఆమె సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఆ తరువాత అంటే జనవరి 21న కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టింది. ఇక అప్పట్నించి ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న షర్మిల ఇటీవల జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది. జగన్ గద్దె దించడమే తన ధ్యేయమని సవాలు విసిరారు. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన షర్మిల సోదరుడి పెళ్లి ఉంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పట్నించి ఆమెకు సోదరుడు జగన్‌కు మధ్య విబేధాలు పెరిగిపోయాయి.
అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ అనంతపురం జిల్లా రాప్తాడులో ఫిబ్రవరి 18న ఉంది. ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి సిద్ధం సభ తరువాత రెండవది ఏలూరులో జరిగింది. ఇక మూడవది ఇప్పటికే జరగాల్సి ఉండగా జగన్ ఢిల్లీ టూర్ నేపధ్యంలో వాయిదా పడింది. తిరిగి ఈ సభ ఈ నెల 18న ఉంది. ఇప్పటికే సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అందుకే సోదరి వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లికి వైఎస్ జగన్ హాజరయ్యే పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు. అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ పెళ్లికి హాజరుకావచ్చని అంచనా. ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి కుమారుడి పెళ్లికి దూరంగా ఉండవచ్చని తెలుస్తోంది.
Also read: AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, బకాయిల చెల్లింపుకు 5500 కోట్ల విడుదలకు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook