Ys Jagan Comments: నెల్లూరు జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలో వచ్చిన 8 నెలలకే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కన్పిస్తోందన్నారు. మేనిఫెస్టోలో హామీలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.
రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు ముఖ్యం కాబట్టే మొన్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మోసాల గురించి ఆనాడే ప్రజలకు చెప్పామన్నారు. నాడు ప్రతి పధకాన్ని ఇంటి వద్దకు అందిస్తే ఇప్పుడే పధకం అందడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 8 నెలలకు బాదుడే బాదుడు మొదలెట్టారన్నారు. 15 వేల కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచడం, గ్రామీణ రోడ్లకు టోల్ వసూలు చేయాలని అనుకోవడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగనామం, ఆరోగ్య శ్రీ బకాయిలు ఇలా ఏ పధకం చూసినా ప్రజలకు దూరమైన పరిస్థితి కన్పిస్తోందన్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అండగా నిలబడి..ప్రతి సమస్యపై సోషల్ మీడియాలో చంద్రబాబును నిలదీయాలన్నారు.
గతంలో ఎవరూ ఎప్పుడూ అమలు చేయనివిధంగా మేనిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసి చూపించామన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడజే సంక్షేమ పధకాల కేలండర్ విడుదల చేశామన్నారు. తద్వారా ప్రజలు ఏ పధకం డబ్బులు ఎప్పుడు అందుతాయో క్లారిటీ ఉండేలా చేశామన్నారు. నాడు జరిగిన మంచి నేడు జరగడం లేదనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో కన్పిస్తోందన్నారు వైఎస్ జగన్. అబద్ధపు హామీలు ఇవ్వలేకే అబద్ధాలు చెప్పలేదన్నారు. అందుకే ఇప్పుడు ప్రతి చోటా నాడు జగన్ చెప్పింది నిజమేననే ప్రచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే 1.72 లక్షల కోట్లు అవసరమని మరోసారి గుర్తు చేశారు.
Also read: Ys Jagan: ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క..కార్యకర్తలకు జగన్ భరోసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.