మరో 10 రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే డాక్టర్ హఠాన్మరణం..

Doctor Died: లైఫ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మనతోనే ఉంటారు. వెంటనే తనువు చాలిస్తారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సాధారణమైపోయాయి. తాజాగా గుండెపోటుతో ఓ యువ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 12:38 PM IST
మరో 10 రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే డాక్టర్ హఠాన్మరణం..

Young Doctor Died : కష్టపడి చదివి అనుకున్నది సాధించాడు. చివరకు డాక్టర్ అయ్యాడు. మరో 10 రోజుల్లో వివాహ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు ఆ యువకుడు. ఇంతలోనే కాలం కన్నెర్ర జేసింది. 29 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాలే చేసింది. యువ వైద్యుడు(Young Doctor) గుండెపోటు(Heart Attack)తో ఆకస్మికంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా(Guntur District) నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎంబీబీఎస్(MBBS) చేశారు. అనంతరం గాంధీ మెడికల్‌ కాలేజీ(Gandhi Medical College) జనరల్‌ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్‌ చేశారు. గాంధీలోనే సీనియర్‌ రెసిడెంట్‌ విధులు కూడా పూర్తి చేశారు. సూపర్‌ స్పెషాలిటీ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌ కోసం ఫ్రెండ్స్ కలిసి పద్మారావునగర్‌లో నివాసముంటున్నారు. వారం రోజుల క్రితం అతనికి ఛాతిలో స్వల్పంగా నొప్పి అనిపించింది. వెంటనే  గాంధీలో హెల్త్ చెకప్(Health Checkup) చేయించుకోగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి.  

Also Read: కాల్వలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య..ఎంటెక్​లో సీటు రాకపోవడమే కారణం...

బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి గుండెల్లో నొప్పి రావడంతో గ్యాస్ వల్ల అనుకుని…గాంధీ ఆస్పత్రి(Ganghi hospital)కి వచ్చి మెడిసిన్ తీసుకున్నారు. అయితే రూమ్‌కి వెళ్లొద్దని, ఎమర్జెన్సీ విభాగం భవనం పైనున్న పీజీ హాస్టల్‌లో ఉండాలని సహచరులు సూచించడంతో ఆయన సరేనన్నారు. పీజీ హాస్టల్‌కు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించినా.. ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోనే ఉన్న డాక్టర్ పూర్ణచంద్ర గుప్తా మరణించారని తెలిసి ఆయన సహచరులు, మిత్రులు షాక్‌కు గురయ్యారు.

పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రకాశరావు, సూపరింటెండెంట్‌ రాజారావు, ఇతర డాక్టర్లు నివాళులర్పించారు. అతడి సేవలను ప్రశంసించారు.  అనంతరం అతడి మృతదేహానికి అంత్యక్రియల నిమిత్తం స్వస్థలానికి తరలించారు. యువవైద్యుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News