Anil kumar Yadav:మాజీ మంత్రి అనిల్ కుమార్ కి బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..

Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

Last Updated : Jun 25, 2024, 06:10 PM IST
  • వెలుగులోకి వస్తున్న వైఎస్సార్సీపీలో భూ బాగోతాలు..
  • పీఎస్ లలో ఫిర్యాదుల వెల్లువ..
 Anil kumar Yadav:మాజీ మంత్రి అనిల్ కుమార్ కి బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..

Woman filed police case against ex minister anilkumar Yadav: వైఎస్సార్సీపీ నేతలకు చెందిన అక్రమాలు ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయి. తమ అధికారం, హోదాలను అడ్డుపెట్టుకుని ఏపీ వ్యాప్తంగా వైసీపీకి చెందిన కొందరు మంత్రులు, నాయకులు అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలోని అనేక జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యాలయాలను అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు.పలు చోట్ల నామమాత్రపు టెండర్ లకు, ప్రభుత్వ భూములు, ప్రజల భూములను సైతం వైసీపీ నాయకులు దోచుకున్నట్లు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొడాలి నాని గుడివాడలో కొందరి స్థలాలు, సినిమా టాకీస్ లను సైతం.. ఆక్రమించుకుని వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.

Read more:Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..

ఇటీవల కొందరు ప్రజలు తిరగబడి తమ స్థలంను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది ప్రజలు.. ప్రభుత్వం మారగానే.. తమకు జరిగిన అన్యాయాలను ప్రభుత్వం వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటం వల్ల పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకొలేదని జనాలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెల్లూరులోని తన భర్త 2002 లో కొనుగోలు చేసిన 2.8 ఎకరాలను, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కబ్జా చేశాడని  కౌసర్ జాన్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. గతంలో అధికారుల చుట్టు తిరిగిన కూడా తనకు న్యాయం జరగలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తనకు ఎలాగైన నా భర్త సంపాదించిన స్థలం తిరిగి ఇప్పించాలని కూడా మహిళ పోలీసులను, అధికారులకు కోరింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఏపీలో చంద్రాబాబు అమరవతి రాజధానిగా పాలన అందిస్తున్నారు.

Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?

ఏపీకి తిరిగి పూర్వవైభవం కలగాలంటూ అందరు కష్టపడి పనిచేయాలంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రజలకు మంచి పాలనఅందిచే దిశగా చర్యలు తీసుకుంటునే మరో వైపు.. గత ప్రభుత్వం చేసి అవినీతి, అక్రమాలను ప్రజల ముందుంచుతున్నారు. ఏపీలో వైసీపీ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ వాలంటీర్లు కూడా వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించిన నాయకుల మీద ఆయా పోలీస్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News