Ys Jagan Confident: ఏపీలో ఈసారి జరిగిన రికార్డు స్థాయి పోలింగ్‌తో కూటమిలో ధీమా పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, కచ్చితంగా అధికారంలో వస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఈసారి కచ్చితంగా 151 ప్లస్ సీట్లు సాదించనున్నామనే ధీమా వ్యక్తం చేశారు. అసలు జగన్‌లో ఇంత ధీమా ఏంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆ ధీమా వెనుక కారణాలేంటో పరిశీలిద్దాం.
ఏపీ ఎన్నికలు ముగిసిన మూడోరోజున ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైనే చర్చ జరుగుతోంది. 2019లో సాధించిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలకు మించి సీట్లు గెలుస్తున్నామని, ఐదేళ్లు మరింత మెరుగైన పాలన అందించనున్నామని చెప్పుకొచ్చారు. ఎవరూ ఊహించని సీట్లు సాధిస్తామని, దేశం మొత్తం ఏపీవైపు చూస్తుందని కూడా చెప్పారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయలు వ్యక్తమైనా తెలుగుదేశం నుంచి పెద్దగా కౌంటర్ కన్పించలేదు. అందుకే ఇప్పుడు జగన్ ధీమాపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ ఏదో ఆషామాషీగా ఈ ప్రకటన చేయలేదని తెలుస్తోంది. ప్రచారం లేదా హైప్ కోసం కూడా కాదని చాలామంది వాదన. ఎందుకంటే జగన్ ఎప్పుడూ ప్రచారం కోసం అలాంటి ప్రకటనలు చేయరనే అభిప్రాయం ఉంది.
151 ప్లస్ ధీమా వెనుక జగన్ చేసిన హోంవర్క్ ఇదీ...
పోలింగ్‌కు ముందే ఎగ్జిట్ పోల్, ఓటింగ్ సరళి, ఓటర్ల నాడి తెలుసుకునేందుకు జగన్ మూడు సర్వే సంస్థల్ని సిద్ధం చేశారట. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు సహకారం అందిస్తున్న ఐప్యాక్, సాక్షి మీడియా, నిఘా వ్యవస్థకు ఇవి అదనం. ప్రతి కేటగరీ నుంచి ఓటరు నాడి తెలుసుకునేందుకు మొత్తం 175 నియోజకవర్గాల్లో పెద్దఎత్తున మూడు సర్వే సంస్థల సిబ్బంది రంగంలో దిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించిన తరువాత సరాసరి లెక్కేశారు. మహిళల ఓటింగ్, గ్రామీణంలో పెరిగిన ఓటింగ్ శాతం, కూటమి కచ్చితంగా గెలిచే స్థానాలపై విశ్లేషించిన తరువాతే వైఎస్ జగన్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. కూటమి అదికారంలో వస్తుందని చెబుతున్న తెలుగుదేశం, జనసేన నేతలు జగన్ ధీమాకు కౌంటర్‌గా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.
Also read: Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook