ఈ నెల 11న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతా అని స్పష్టంచేశారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. అంతేకాదు.. పవన్ కల్యాణ్‌తో భేటీ పూర్తయిన తర్వాత మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడిస్తానని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ తనతో పెద్దవాళ్ల తరహాలో మాట్లాడారని.. ఆయనను కలిసి తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటానని ఉండవల్లి తెలిపారు.
ఏపీలో జాయింట్ యాక్షన్ కమిటీ పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఉండవల్లి స్పందిస్తూ.. ఏపీలో మరో పాతికేళ్ల వరకూ ఇక ఉద్యమాలు అనేవి వుండవని జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంతోనే ఉద్యమాలు ముగిశాయి అన్నారు. ప్రస్తుతం ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్లాలనుకుంటున్నారు అని ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.
పవన్ కల్యాణ్‌తో భేటీ అవుతానంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత!