Tirumala Temple Drone Visuals: తిరుమల డ్రోన్ విజువల్స్ కలకలం.. టిటిడి ఆగ్రహం

Tirumala Temple Drone Visuals: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు కదా విమానాలకు కూడా అనుమతి లేదనే విషయం తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 04:54 AM IST
Tirumala Temple Drone Visuals: తిరుమల డ్రోన్ విజువల్స్ కలకలం.. టిటిడి ఆగ్రహం

Tirumala Temple Drone Visuals: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు కదా విమానాలకు కూడా అనుమతి లేదనే విషయం తెలిసిందే. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలన్నీ విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపిస్తుండటం టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన టిటిడి అధికారులు.. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాలను చిత్రీకరించిన యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఐకాన్ అనే ఓ యూట్యూబ్ ఛానెల్లో శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను పోస్ట్ చేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రోన్ కెమెరాలపై నిషేధం ఉండగా.. ఈ డ్రోన్ కెమెరా విజువల్స్ ఎలా చిత్రీకరించారని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

జనవరి 7న గృహనివాస్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టు తెలుస్తోంది. గత కోన్ని రోజులుగా గుడి వెనుక భాగంలో ఒక భారీ క్రేన్ ఏర్పాటు చేసి ఉంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆ క్రేన్ కనిపించడం లేదు. దీంతో ఇది ఇటీవల తీసిన రీసెంట్ వీడియోనా లేక పాత వీడియోను ఇప్పుడు అప్‌లోడ్ చేసారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. టిటిడి అధికారులు సైతం పోలీసుల సహాయంతో ఇదే కోణంలో ఆరా తీస్తున్నారు. 

అయితే, వీడియో కొత్తదా పాతదా అనే సంగతి పక్కనపెడితే.. అసలు శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో ఏరియల్ వ్యూలో బంధించడానికి వీల్లేదు. వీడియో పాతదైనా, కొత్తదైనా ఇది నేరమే అవుతుంది. టీటీడీ అధికారులు సైతం ఇదే విషయంపై విచారణ చేపట్టి తదుపరి చర్యలకు పూనుకునే యోచనలో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతపై అనేక సవాళ్లు లేవనెత్తిన ఈ వీడియో ప్రస్తుతం టిటిడి వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Woman Catches Chain Snatcher: చైన్ స్నాచర్‌‌ని చాకచక్యంగా పోలీసులకు పట్టిచ్చిన మహిళ

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News