ఆగస్టు 3 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం..!!

'కరోనా వైరస్' దెబ్బకు  మూడు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి.  లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. పైగా వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది.

Last Updated : May 19, 2020, 03:53 PM IST
ఆగస్టు 3 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం..!!

'కరోనా వైరస్' దెబ్బకు  మూడు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి.  లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. పైగా వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది.

దీంతో స్కూళ్లను ఇప్పుట్లో తెరిచే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. నిజానికి స్కూళ్లు ఏటా జూన్ రెండోవారంలో తెరుచుకోవాల్సి ఉంటుంది.  కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు వేసవి సెలవులు తర్వాత కూడా తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే దానిపై సర్వత్రా చర్చ జరిగింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  దీనిపై క్లారిటీ ఇచ్చింది.  పాఠశాలలను ఆగస్టు 3 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించింది. అంతే కాదు స్కూళ్లలో నాడు-నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను జులైలోగా  పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొదటి విడత 15 వేల 715 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు స్కూళ్లలో 9 రకాల  సదుపాయాలు  కల్పించేందుకు 456 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశారు. జులైలో నెలాఖరులోగా పనులు పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల  కలెక్టర్లు చర్యలు  తీసుకోవాలన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News