Chandrababu Case: చంద్రబాబుని అంతం చేస్తామంటున్న వైసీపీ నేతలు, నారా లోకేశ్ ఆగ్రహం

Chandrababu Case: వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2023, 07:26 AM IST
Chandrababu Case: చంద్రబాబుని అంతం చేస్తామంటున్న వైసీపీ నేతలు, నారా లోకేశ్ ఆగ్రహం

Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు 50 రోజుల్నించి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, అతని తల్లి భువనేశ్వరిలు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన లోకేశ్..వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో ప్రస్తుతం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని, చంద్రబాబు చనిపోవడమే వైసీపీ నేతలకు కావాలని నారా లోకేశ్ దుయ్యబట్టారు. చంద్రబాబును అంతమొందిస్తామని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. 50 రోజులుగా జైలులో ఉంచి కొత్త ఆధారం ఒక్కటైనా ప్రజల ముందు పెట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని గట్టిగా చెప్పగలనన్నారు లోకేశ్. పార్టీ ఖాతాలు డబ్బులు చేరినట్టు చెబుతున్నారని. దీనికి ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. స్కిల్ స్కాం కేసులో తమకు, కుటుంబసభ్యులకు, మిత్రులకు ఎలాంటి పాత్ర లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదన్నారు. 

వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ చంద్రబాబు బయటకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బయటకు రాకుండా చేసేందుకు కోట్లాది రూపాయలు న్యాయవాదుల ఫీజు ప్రభుత్వం చెల్లిస్తోందని లోకేశ్ ఆరోపించారు. బస్సు యాత్ర పేరుతో వైసీపీ నేతలు గాలి యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

Also read: తిరుమల సహా ఆలయాల మూసివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News