AP Politics: చౌరస్తాలో చౌదరి గారు.. ఎక్కడో తేడా కొడుతుంది సీనా..!

MLA Sujana Chowdary News: ఆంద్రప్రదేశ్‌లోని కూటమిలో ఓ కీలక నేత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా..? సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా ముద్ర ఉన్న ఆ నేత సడన్‌గా సైలెంట్ కావడం వెనుక కారణమేంటి..? ఏపీలో అధికారంలో ఉన్నా ఆయనలో మాత్రం ఏదో తెలియని వెలితి దాగి ఉందా..? కూటమి అధికారంలోకి వస్తే తనకు పెద్ద పదవి వస్తుందనుకొని ఆశపడి భంగపడ్డారా..? ఎవరూ ఊహించనట్లుగా ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం వెనుక ఉన్న కథేంటి..? ఆ నేత తీరును చూసి టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారా..? ఈయన గారి తీరు చూస్తుంటే ఏదో తేడా కొడుతుందని గుసగుసలు పెట్టుకుంటున్నారా..? ఇంతకీ ఎవరా లీడర్..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 18, 2025, 05:27 PM IST
AP Politics: చౌరస్తాలో చౌదరి గారు.. ఎక్కడో తేడా కొడుతుంది సీనా..!

MLA Sujana Chowdary News: సుజనా చౌదరి ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేని రాజకీయ నాయకుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత  సన్నిహితుడిగా సుజనా చౌదరికి ముద్ర ఉంది. సీఎం చంద్రబాబుకు ఉన్న అతి కొద్ది మంది అంతరంగికుల్లో సుజనా ఒకరు. అలాంటి సుజనా చౌదరి తీరు ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా చౌదరి గారు ఎందుకో పూర్తిగా సైలెంట్ అయ్యారని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక సుజనా చౌదరి హవా మామూలుగా ఉండదని అందరూ భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం మరోలా ఉన్నాయి. గతంలో ఉన్నట్లుగా సుజనా చౌదరి యాక్టివ్‌గా లేరని తెగ ప్రచారం జరుగుతోంది. సుజనా చౌదరి ఏదైనా అసంతృప్తిలో ఉన్నారా అనే చర్చ ఇటు  టీడీపీతో పాటు బీజేపీ వర్గాల్లో వినబడుతోంది.

దీనికి తోడు తాజాగా సుజనా చౌదరి చేసిన ట్వీట్ కూడా రాజకీయంగా సంచలనంగా మారింది. ఏపీ మాజీ సీఎం జగన్ కూతురుకు ఎమ్మెల్యే సుజనా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది.  లండన్ లోని ప్రఖ్యాత  కింగ్స్ కాలేజీ నుంచి జగన్ కూతరు వర్షారెడ్డి డిస్ట్రింక్షన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. దీనికి అభినందనలు తెలుపుతూ సుజన్ జగన్ ట్యాగ్ చేశారు. దీంతో టీడీపీ సానుభూతిపరులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉన్నట్లుండి జగన్ మీద చౌదరి గారికి అంత ప్రేమ పుట్టుకరావడం వెనక కథేంటో ఉన్న రచ్చ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం సుజనాకు మద్దతుగా నిలవడం మరింత ఆసక్తికరంగా మారింది.తన ట్వీట్ తో తీవ్ర రాజకీయ రచ్చ జరుగుతుండడంతో వెంటనే డిలీట్ చేశారు. మొత్తానికి ఇలా సుజనా తీరు రాజకీయవర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తుంది.

మొన్నటి ఎన్నికల్లో వైఎస్ చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కూటమిలో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేసి సుజనా గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. బీజేపీ తరుపున మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సుజనా ఒకరు. చౌదరి రాజకీయాల్లో సీనియర్ కావడం దానికి తోడు సీఎం చంద్రబాబు, ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో ప్రభుత్వంలో కీలక పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు సుజనా మాత్రం ఒక సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. అప్పటి నుంచి వైఎస్ చౌదరి అసంతృప్తిలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలో తాను సీనియర్ ఐనా తనకు మంత్రి పదవి దక్కలేదనే భావనలో సుజనా ఉన్నట్లు ఆయన వర్గం చెబుతుంది.

ఐతే ప్రస్తుత ఉన్న ఎమ్మెల్యే పదవితో మాత్రం సుజనా ఏమాత్రం సంతృప్తి లేరనే టాక్ వినిపిస్తుంది.  అంతక ముందు రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉన్న సుజనా చౌదరి ,ఎమ్మెల్యే పదవిలో అంతగా కన్ఫర్ట్ గా లేనట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఉన్నప్పుడు తరుచుగా ప్రధానీ మోదీ, అమిత్ షా తో అనేక మంది కేంద్ర మంత్రులను కలిసిన సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా ఉండడం అంతగా ఇష్టపడడం లేదని తెలుస్తుంది. కనీసం తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఐనా దక్కితే బాగుండేది అని అనచరుల వద్ద పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దీని కన్నా ఎంపీగా ఉన్నా బాగుండేది కదా అని సుజనా తన అచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది..

ఇటీవల జరుగుతున్న పలు కార్యక్రమాల్లో కూడా సుజనా అంతంతగానే పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పు చేశామన్న అని ఇప్పుడు పదే పదే అనుకుంటున్నట్లు అనచరులు చెబుతున్నారు. ఈ గల్లీ కన్నా ఆ ఢిల్లీయే బాగుందనే సుజనా భావన అని అనచరులు  చెబుతున్నారు. మరోవైపు తనకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణాలపై కూడా సుజనా ఆరా కూడా తీసారట. ఐతే అందులో ముఖ్యంగా చంద్రబాబు సన్నిహితుడిగా ముద్ర ఉండడంతోనే మంత్రి పదవి దక్కకపోవడానికి ఒక కారణంగా తెలుస్తుంది. దీంతో పాటు  బీజేపీలో మొదటి నుంచి ఉండి బీజేపీ సిద్దాంతాలను నమ్ముకున్న వాళ్లకు బీజేపీ అధిష్టానం మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని అందులో భాగంగా సత్యకుమార్‌కు మంత్రి పదవి వచ్చిందని సుజనా భావిస్తున్నారట. ఐతే భవిష్యత్తులోనైనా ఏదైనా కీలక అవకాశం రాకపోతుందా అని సుజనా యోచిస్తున్నారట.

ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సుజనా బీజేపీలో చేరారు. ఒక రకంగా అప్పుడు సుజనాతో పాటు మరో ఎంపీ సీఎం రమేశ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ఇద్దరికి కూడా చంద్రబాబు మనుషులే అనే ముద్ర ఉంది. దీంతో ఈ ఇద్దరు అప్పుడు చంద్రబాబు ప్రోత్సాహంతోనే  బీజేపీ చేరారని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆ ఇద్దరు బీజేపీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవల మళ్లీ టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో సుజనా చౌదరి ఆలోచనలో మార్పు వచ్చిందంట. ఎలాగో తమ గురువు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండడంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారట. కానీ అలా జరగకపోవడంతో కొంత నిరాశలో సుజనా ఉన్నట్లు తెలుస్తుంది. 

మొత్తానికి చౌదరి గారి తీరు ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుజనా చౌదరి అనుకున్న మంత్రి పదవి దక్కుతుందా..? చంద్రబాబు సుజనా చౌదరిని కేబినెట్‌లోకి తీసుకుంటారా..? ఒక వేళ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందా అనేది మాత్రం తేలాల్సింది భవిష్యత్తులోనే..!

Trending News