Lokesh Met Amit Shah: పురంధరేశ్వరితో కలిసి అమిత్ షాతో భేటీ అయిన నారా లోకేశ్, పురంధరేశ్వరి తీరుపై విమర్శలు

Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 12, 2023, 07:50 AM IST
Lokesh Met Amit Shah: పురంధరేశ్వరితో కలిసి అమిత్ షాతో భేటీ అయిన నారా లోకేశ్, పురంధరేశ్వరి తీరుపై విమర్శలు

Lokesh Met Amit Shah: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వైఖరిపై ఆ పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. సోదరి కుమారుడు నారా లోకేశ్‌ను తీసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. 

టీడీపీ నేత నారా లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సెప్టెంబర్ 14 నుంచి ఢిల్లీలోనే ఉంటున్న లోకేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని జాతీయ మీడియా దృష్టికి, బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిద్దరు బీజేపీ నేతల్ని కలవడం మినహా అగ్రనేతల్ని మాత్రం కలుసుకోలేకపోయారు. అయితే నారా లోకేశ్ ప్రయత్నాలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సహకారం అందించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, లోకేశ్ కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు. 

విశేషమేంటంటే అమిత్ షాతో జరిగిన భేటీ వివరాల్ని లోకేశ్ వివరించలేదు. స్వయంగా పురంధరేశ్వరే వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పగబట్టిన తీరును లోకేశ్ అమిత్ షాకు వివరంగా చెప్పారని, కేంద్రంపై నిందలు వేసేవారు సమాధానం చెప్పాల్సిన అవసరముందని, అరెస్ట్ వెనుక అమిత్ షా హస్తముంటే లోకేశ్‌కు అపాయింట్‌మెంట్ ఎందుకిస్తామంటూ పురంధరేశ్వరి ట్వీట్ చేశారు. 

తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని సైతం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, లోకేశ్‌పై ఎన్ని కేసులు పెట్టారో అడిగి తెలుసుకున్నారు. లోయర్ కోర్టు, హై కోర్టు, సుప్రీంకోర్టులో వివిద కేసుల అప్‌డేట్స్ గురించి లోకేశ్ వివరించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నం కంటే బంధువైన లోకేశ్‌కు సహకరించే ఉద్దేశ్యమే పురంధరేశ్వరిలో ఎక్కువగా కన్పిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. లోకేశ్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ లభించేందుకు పురంధరేశ్వరి అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారోనని బీజేపీలోనే విమర్శలు వస్తున్నాయి. అమిత్ షాతో భేటీ తరువాత లోకేశ్ ఏం చెప్పారో పురంధరేశ్వరి ట్వీట్ చేసి చెప్పడం మరో విశేషం.

Also read: Vizag Shifting: విశాఖ షిఫ్టింగ్‌కు సర్వం సిద్ధం, అధికారిక జీవో నెంబర్ 2015 సైతం విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News