Atchannaidu on CM Jagan: సీఎం జగన్ ..సామాజిక న్యాయ విద్రోహి అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవుల పేరుతో తీర్మానం చేయడం సిగ్గు చేటు అని అన్నారు. 56 కార్పొరేషన్లతో మూడేళ్లలో ఖర్చు ఎంత చేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టారని మండిపడ్డారు.
16 వేల 800 మందికి ద్రోహం చేశారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.26 వేల కోట్లు దారి మళ్లించడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. ఎస్పీ సబ్ ప్లాన్ ద్వారా మూడేళ్లలో ఖర్చు ఎంత చేశారని..11 వేల 500 ఎకరాల దళితుల అసైన్డ్ భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.విద్య, ఉపాధి హక్కులను కాలరాసి..దళితులను అణగదొక్కడం నిజం కాదా అని అన్నారు.
ఎస్సీలకు చెందిన 28 పథకాలతోపాటు కేంద్ర పథకాలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిర్వీర్యం సామాజిక న్యాయామా జగన్ రెడ్డీ అంటూ తీవ్ర స్థాయిలో అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మన్యంలో చంద్రబాబు కాఫీ తోటలు పెంచితే..జగన్‌రెడ్డి గంజాయి తోటలు పెంచారని విమర్శించారు. సంక్షేమ నిధులు రూ.1483 కోట్లు దారి మళ్లించడం నిజం కాదా అని అన్నారు.
రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ ఎందుకు ఆపారని..ఇస్లామిక్ బ్యాంకు హామీపై మాట తప్పడం మైనార్టీ ద్రోహం కాదా అని విమర్శించారు. పది మందికి పదవులు ఇచ్చి వేల మందిని హత్య చేయడం ఇదేమి సామాజిక న్యాయమని ప్రశ్నలు సంధించారు అచ్చెన్నాయుడు. దళితులకు బొరుగులు పెట్టి..వారి బంగారం కొట్టేయడం ఏంటని అన్నారు.
Also read:How To Burn Belly Fat: ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!
Also read:Perni Nani: మాజీ మంత్రి పేర్నినాని నోట మరోసారి భరత్ అనే నేను సినిమా డైలాగ్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook