ఏపీతో పోల్చుతూ కేసీఆర్‌ సర్కార్‌ను నిలదీసిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

                             

Last Updated : Mar 29, 2019, 03:38 PM IST
ఏపీతో పోల్చుతూ కేసీఆర్‌ సర్కార్‌ను  నిలదీసిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల విమర్శలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాలన్ని నిలదీశారు. గాంధీభవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో  2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.... ఐదేళ్ల కాలంలో కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు

ఉద్యోగాల భర్తీతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా  కేసీఆర్ నిలబెట్టుకోలేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని కేసీఆర్ ఇంకా నిలబెట్టుకోలేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. లోటు బడ్జెట్ తో ఉన్న పక్క రాష్ట్రం లో నిరుద్యోగులకు భృతి ఇస్తున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని ...కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆపని చేయలేకపోయిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరుద్యోగ యువత.. ఉద్యోగులు  తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని  జీవన్ రెడ్డి విమర్శించారు.

Trending News