Somu Veerraju Sensational Comments: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. గత 42 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని... పదవులపై తనకెలాంటి వ్యామోహం లేదని అన్నారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా బీజేపీకి ఉందని... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉందని అన్నారు.
తనకు సీఎం అవ్వాలనే కోరిక ఏమీ లేదని సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసిన సమయంలో తనకు రాజమండ్రి (Rajahmundry) ఎమ్మెల్యే టికెట్‌తో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారని సోము వీర్రాజు గుర్తుచేశారు. అయితే తాను కాదనడంతో ఆ అవకాశం ఆకుల సత్యనారాయణకు దక్కిందన్నారు. పదవులు పొందే అవకాశం వచ్చినా తాను వదులుకున్నానని చెప్పారు. తాను నిబద్దత కలిగిన కార్యకర్తను అని పేర్కొన్నారు.
ప్రస్తుత వైసీపీ (YSRCP) పాలనలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని... రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. రాష్ట్రం అప్పులమయంగా తయారైందని అన్నారు. పోలవరం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.11వేల కోట్లు ఇచ్చిందని... మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఆ నిధులను త్వరలోనే విడుదల చేస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గత టీడీపీ హయాంలో పోలవరం అంచనాలను విపరీతంగా పెంచేశారని ఆరోపించిన వైసీపీ.. ఇప్పుడదే అంచనాల ప్రకారం నిధులు కోరడమేంటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం ప్రభుత్వానికి చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై (Gajendra Singh Shekawat) వైసీపీ విమర్శలను తప్పు పట్టారు. పొరపాటును సరిదిద్దుకోవాల్సిందిపోయి విమర్శలకు దిగడమేంటని ప్రశ్నించారు.
కాగా, 2024 తర్వాత రాజకీయాలకు (AP Politics) గుడ్ బై చెప్తున్నట్లు సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీ (BJP) శ్రేణులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారనే దానిపై చర్చ జరుగుతోంది. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Prabhas: సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ భారీ విరాళం-వదర బాధితులను ఆదుకునేందుకు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ప్రకటన
రాజకీయ భవిష్యత్తుపై సోము వీర్రాజు సంచలన ప్రకటన
2024 తర్వాత రాజకీయాలకు గుడ్ బై
తనకు పదవులపై వ్యామోహం లేదని కామెంట్