Simhachalam Vaikuntha Dwara Darshan Timings: వైష్ణవాలయాల సంప్రదాయాలను ప్రకారం సింహాచలం శ్రీస్వామి వారి ఆలయంలో డిసెంబరు 23న ఉదయం 5 గంటల నుంచి 11:30 గంటల వరకు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసు మూర్తి తెలిపారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. గురువారం వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతుతో కలసి క్యూలైన్లు మంచినీటి సదుపాయం, పాలిచ్చే తల్లులు కోసం ప్రత్యేక పాల కేంద్రాల సదుపాయంలను పరిశీలించారు. వివిధ అంశాలపై చర్చ నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 23న తెల్లవారుజామున 5.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి.. ఉదయం 11.30 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండకుండా శ్రీస్వామి వారి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొండపై రూ.300, రూ.100 ప్రత్యేక దర్శన టికెట్లను విక్రయిస్తున్నామని.. ఈ టికెట్ల ద్వారా వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం టికెట్లు లభిస్తుందన్నారు.
డిసెంబరు 23వ తేదీకి సంబంధించిన ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనాలు నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. సింహాచలం దేవస్థానం కొండపై గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా గదులు కేటాయించలేమన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 11:30 నుంచి ఆలయ నాలుగుమాడ వీధులలోస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకత ఇదే..
పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతకు ఉంది. దేవలోకంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు అయితే.. భూలోకంలో 6 నెలలు ఉత్తరాయణం.. రాత్రి 12 గంటలు అయితే ఇక్కడ 6 నెలలు దక్షిణాయణంగా ఉంటుంది. దేవలోకంలో తెల్లవారుజామున 120 నిమిషాల సమయం భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.
భూలోకంలో వైష్ణవాలయాలలో ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందనేది నమ్మకం. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు రావాల్సిందిగా ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసచార్యులు కోరారు. కొండ దిగువనగల స్వామివారి అనుబంధ దేవాలయం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read: Free Bus Ticket: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. వాళ్లు టిక్కెట్ కొనాల్సిందే.. కొత్త రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook