Jr Ntr: బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం! ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలనం..

Jr Ntr: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు జూనియర్. అప్పటి నుంచి ఆయన చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Sep 5, 2022, 03:46 PM IST
  • బీజేపీకి జూనియర్ ప్రచారం!
  • ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు
  • బీజేపీకి తారక్ ప్రచారం చేయరు- రఘురామ
Jr Ntr: బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం! ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలనం..

Jr Ntr: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు జూనియర్. అప్పటి నుంచి ఆయన చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయాలని తారక్ ను అమిత్ షా కోరారని.. అందుకు జూనియర్ కూడా అంగీకరించారనే ప్రచారం సాగుతోంది. టీడీపీ, బీజేపీ పొత్తు గురించే ఎన్టీఆర్ తో అమిత్ షా మాట్లాడి ఉంటారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. అమిత్ షా - జూనియర్ సమావేశంపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు పరస్పర విరుద్ద ప్రకటన చేస్తున్నారు.  ఆర్ఆర్ఆర్  సినిమాలో జూనియర్ నటన బాగుండటంతో ప్రశంసించడానికే అమిత షా పిలుపించారని తెలంగాణ కమలనాధులు చెబుతుండగా.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తారక్ ను తాము ఉపయోగించుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో అడుగు ముందుకు వేసి.. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను తాము వాడుకుంటామనిప్రకటించారు.

బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించి తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ చేసిన జూనియర్.. ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచన చేయకపోవచ్చన్నారు. ఒకవేళ జూనియర్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తే.. కొన్ని వర్గాల అభిమానులను ఆయన దూరం చేసుకోవాల్సి వస్తుందని రఘురామ అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీకి ప్రచారం చేసే నిర్ణయం తారక్ తీసుకోకపోవచ్చన్నారు. అయితే భవిష్యత్‌లో మాత్రం తెలుగు దేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ చేరుతారని రఘురామ చెప్పారు.

ఏపీ పొత్తులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.  టీడీపీతో బీజేపీ పొత్తు ఉండే అవకాశం లేదన్నారు. కేంద్రం పెద్దలతో పవన్ కల్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయని.. బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఇమేజీని వాడుకునేందుకు సోము వీర్రాజు పడరాని పాట్లు పడుతున్నారని రఘురామ సెటైర్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా జీవితాన్ని పక్కనపెట్టి ఇప్పుడే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని తాను అస్సలు ఊహించడం లేదన్నారు. భవిష్యత్ లో మాత్రం ఏపీ రాజకీయాల్లో తారక్ కీలకంగా మారుతారన్నారు.

Read Also: Ganesh Immersion 2022 : హైదరాబాద్ గణేష్ నిమజ్జనంపై వివాదం.. శుక్రవారమే జరిపి తీరుతామంటున్న ఉత్సవ సమితి

Read Also: NTR 30 Update: ఎన్టీఆర్ 30 షూట్ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే మొదలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News