Margadarsi Issue: మార్గదర్శి కేసులో వేగం పెంచిన సీఐడీ, శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు

Margadarsi Issue: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు మార్గదర్శి ఆస్థుల జప్తుకు రంగం సిద్ధం చేసిన సీఐడీ..ఈసారి శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2023, 08:26 AM IST
Margadarsi Issue: మార్గదర్శి కేసులో వేగం పెంచిన సీఐడీ, శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు

Margadarsi Issue: ఆంధ్రప్రదేశ్ సీఐడీ వేగం పెంచింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ సంస్థ చరాస్థుల్ని జప్తు చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగిందనే కోణంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌లతో పాటు ఇతర బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదయ్యాయి. అటు సీఐడీ కూడా రామోజీరావు, శైలజా కిరణ్‌లను విచారించింది. ఖాతాదారుల డబ్బుల్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. చిట్స్ ద్వారా వసూలైన డబ్బుల్ని స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడులు పెట్టడం, మ్యూచ్యువల్ ఫండ్స్‌కు బదిలీ చేయడం వంటి ఆరోపణలున్నాయి. అదే సమయంలో మెచ్యూర్ అయిన డిపాజిట్లు లేదా చిట్‌ఫండ్స్ డబ్బుల్ని చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారంటూ ఖాతదారుల్నించి ఫిర్యాదులు ఏపీసీఐడీకు చేరాయి.

మరోవైపు ఇదే కేసుకు సంబంధించి డిపాజిట్ దారుల ప్రయోజనాలు రక్షించేందుకు మార్గదర్శి చరాస్థులు మొత్తం 793 కోట్లను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం అనుమతితో ఏపీసీఐడీ ఆస్థుల జప్తుకు రంగం సిద్ధం చేస్తోంది. 

ఇప్పుడు తాజాగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు ఏపీసీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాలు చేస్తూ శైలజా కిరణ్ కోర్టును ఆశ్రయించారు. శైలజా కిరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని..త్వరలోనే వస్తున్నట్టు కోర్టుకు విన్నవించారు. లుక్ అవుట్ నోటీసులు ఉపసంహరించుకునేలా ఏపీసీఐడీని ఆదేశించాలని శైలజా కిరణ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంట్లో విచారణకు సిద్ఘంగా ఉండాలంటూ సీఐడీ నోటీసు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు కోర్టుకు తెలిపారు. అయినా సరే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారన్నారు. జూన్ 3వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయంలో ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఆదేశాలివ్వాలన్నారు.

Also read: Margadarsi Assets: మార్గదర్శి కేసులో కీలక పరిణామం, 793 కోట్ల చరాస్థుల జప్తుకు సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News