విశాఖ రైల్వే జోన్ పై లోక్‌సభ బిల్లు

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు శుక్రవారం లోక్‌స‌భ‌లో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లును ప్రవేశపెట్టారు.

Last Updated : Dec 29, 2017, 08:53 PM IST
విశాఖ రైల్వే జోన్ పై లోక్‌సభ బిల్లు

విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు శుక్రవారం లోక్‌స‌భ‌లో ప్రైవేటు మెంబ‌ర్ బిల్లును ప్రవేశపెట్టారు. 1989 రైల్వే చ‌ట్టానికి  స‌వ‌ర‌ణ కోరుతూ ఈ బిల్లును ఆయ‌న ప్రతిపాదించారు.  విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన విధంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాల‌ని..ఆ జోన్‌లో వాల్తేరు, విజ‌య‌వాడ‌, గుంటూరు, గుంత‌క‌ల్లు  రైల్వే డివిజ‌న్లను క‌ల‌పాల‌ని కోరారు. ఈ బిల్లు త్వరలోనే చర్చకు వస్తుందని సమాచారం.

గతంలో కేంద్రం ప్రవేశబెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక రైల్వే జోన్ గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ  తీసుకోలేదు. అప్పటి బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ విశాఖ రైల్వేజోన్ అంశాన్ని ప్రస్తావించకపోవటంతో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేసారు. ఈ క్రమంలో తాజాగా రామ్మోహ‌న్ నాయుడు ప్రతిపాదించిన బిల్లు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Trending News