Kakinada Rape Incident: కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ రేప్..

Kakinada Rape Incident: కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ బాలికపై అక్కడి కరస్పాండెంట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఇటీవల తీవ్ర రక్తస్రావమవడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 08:47 AM IST
  • కాకినాడలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
  • 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ హాస్టల్ కరస్పాండెంట్
  • కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి అఘాయిత్యం
Kakinada Rape Incident: కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ రేప్..

Kakinada Rape Incident: కాకినాడలో దారుణం వెలుగుచూసింది. ఓ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్‌లో ఓ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఆ హాస్టల్ కరస్పాండెంటే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... కాకినాడ జిల్లాలోని కొండయ్యపాలెంలో ఓ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టల్‌లో 15 ఏళ్ల ఓ బాలిక వసతి పొందుతోంది.స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుకుంటోంది. బాలికకు తండ్రి లేకపోవడంతో తల్లే అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చి చూస్తుండేది. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన బాలిక ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర రక్తస్రావం జరగడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అక్కడి వైద్యులు బాలికకు గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు.దీంతో బాలిక తల్లి ఆమెను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హాస్టల్ కరస్పాండెంట్ (60) తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. కరోనా మందు ఇస్తానని చెప్పి అతని గదిలోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత తాను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. అలా పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Hyderabad Minor Girl Gang Rape: దుబాయ్ చెక్కేసిన ఎమ్మెల్యే కొడుకు? గ్యాంగ్ రేప్ కేసును నీరుగార్చేపనిలో బడా నేత?

Also Read: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News